న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్ నాటికి యూపీఐ లావాదేవీలు నెలకు 11.6 శాతం వృద్ధి రేటుతో రూ.5.47 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గత నెలలో యూపీఐ లావాదేవీలు రూ.4.91 లక్షల కోట్లుగా ఉన్నాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) తెలిపింది. యూపీఐ లావాదేవీల సంఖ్య జూన్‌లో 280 కోట్లుగా ఉండగా.. మే నెలలో 253 కోట్లుగా ఉన్నాయని పేర్కొంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) యాజమాన్యంలో దేశంలో రిటైల్ చెల్లింపులు, పరిష్కార వ్యవస్థలను నిర్వహించే వ్యవస్థనే ఎన్‌పీసీఐ. ఇది ఒకే మొబైల్ అప్లికేషన్‌లో బహుళ బ్యాంక్ ఖాతాల నుంచి ఆర్ధిక లావాదేవీలను నిర్వహించే వీలు కల్పిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment