
దేశంలో డిజిటల్ చెల్లింపులకు కీలకంగా ఉన్న యూపీఐ సేవలను ఖతార్‌కు విస్తరిస్తున్నట్లు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ పేమెంట్స్(ఎన్‌ఐపీఎల్) తెలిపింది. ఈమేరకు ఖతార్ నేషనల్ బ్యాంక్(క్యూఎన్‌బీ)తో ఒప్పందం జరిగినట్లు పేర్కొంది. ఆ దేశంలో నివసిస్తున్న భారతీయులు, ప్రయాణికులకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడుతాయని ఎన్‌ఐపీఎల్ చెప్పింది.
ఈ సందర్భంగా ఎన్‌పీసీఐ పార్ట్‌నర్స్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ డిప్యూటీ చీఫ్ అనుభవ్ శర్మ మాట్లాడుతూ..‘ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఖతార్‌లోని భారత వినియోగదారులకు మరిన్ని సేవలందించేందుకు ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ ఖతార్ నేషనల్ బ్యాంక్(క్యూఎన్‌బీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఖతార్‌లోని భారతీయులు, ప్రయాణికులు, టూరిస్టులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు’ అని తెలిపారు.
ఇదీ చదవండి: రూ.61 కోట్లు రికవరీ చేసిన ఈపీఎఫ్‌ఓ
2024లో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలకు వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య 98 లక్షలుగా ఉంటుందని అంచనా. అందులో యూఏఈ ద్వారానే 52.9 లక్షల మంది రాకపోకలు జరిపే అవకాశం ఉంది. ఇటీవల యూఏఈలో యూపీఐ సేవలు ప్రారంభిస్తున్నట్లు ఎన్‌పీసీఐ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment