ఫిన్‌టెక్ స్టార్టప్ కంపెనీగా మొదలై యూనికార్న్‌గా ఎదిగి ఎంతోమంది ఔత్సాహిక ఎంట్రప్యూనర్లకు స్ఫూర్తిని ఇచ్చింది భారత్‌పే. కానీ ఇప్పుడు బోర్డు సభ్యలు మధ్య చెలరేగిన గొడవలతో ఆ కంపెనీ ప్రతిష్ట మసకబారుతోంది. దిగజారుడు విమర్శలతో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.
కంపెనీని సొమ్ముతు ఇష్టారీతగా ఖర్చు చేయడంతో పాటు అసంబద్ధమైన నిర్ణయాలు తీసుకున్నాడనే ఆరోపణలతో భారత్‌పే ఫౌండర్లలో ఒక్కడైన అశ్నీర్ గ్రోవర్‌ను ఇటీవల కంపెనీ నుంచి బయటకు పంపారు. అప్పటి నుంచి అశ్నీర్‌గ్రోవర్‌పై ఏదో ఆరోపణ వస్తూనే ఉంది. దానికి అతను కౌంటర్ ఇస్తూనే ఉన్నాడు. నిన్నటికి నిన్న కంపెనీ డబ్బులను ఇష్టారీతిగా ఖర్చు పెడుతూ పది కోట్ల రూపాయల విలువైన డైనింగ్ టేబుల్ కొనుగోలు చేశాడనే ప్రచారం జరిగింది. ఇప్పుడు దానికి మంచి మరో చిల్లర ఆరోపణలు అతనిపై వచ్చాయి.
క్రికెట్ టోర్నీని వదల్లేదు
2021 అక్టోబరు, నవంబరులో టీ 20 వరల్డ్ కప్ టోర్నమెంట్ జరిగింది. ఈ టోర్నీకి భారత్‌పే గ్లోబల్ పార్టనర్‌గా వ్యవహరించింది. ఈ క్రమంలో టోర్నీ నిర్వాహకులు తమ పార్టనర్లకు ప్రతీ మ్యాచ్‌కి 700ల వరకు ఉచిత్ పాస్‌లు అందించారు. అయితే గ్లోబప్ పార్టనర్‌గా భారత్‌పేకు దక్కిన పాసులను అశ్నీర్‌గ్రోవర్ అమ్ముకుని కోట్లు సంపాదించాడనే మరో ఆరోపణ తెరపైకి వచ్చింది.
ఫ్రీ పాసుల అమ్మకం?
ప్రతీ పాసుని కనీసం 750 దిర్‌హాం (ఇండియన్ కరెన్సీలో రూ.15,000)లకు అమ్ముకున్నాడని, వీఐపీ పాస్‌ల ధర అయితే చెప్పలేమని కొందరు మాజీ ఉద్యోగులు చెప్పినట్టుగా జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితం అయ్యాయి. పేరుకే భారత్ పే ఉద్యోగులకు కొన్ని జనరల్ స్టాండ్‌లకు సంబంధించిన పాస్‌లు అందాయని మిగిలనవి అశ్నీర్ అమ్ముకున్నాడనే తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
What BharatPe Board thinks I am doing at ICC World Cup “10 ka 2, 10 ka 2, 10 ka 2 - aye sahab mangta hai kya ticket black mein ?!” What I am actually doing is ensuring Suhail Sameer and @sumeetsingh29 don’t drink silly the hospitality section dry. Kuchh nahi mila to kuchh bhi !!! pic.twitter.com/jI7vmWDECx
— Ashneer Grover (@Ashneer_Grover) March 16, 2022
కపట నాటకాలు ఆపండి
క్రికెట్ టోర్నమెంట్ పాసులు అమ్ముకున్నట్టు తనపై వస్తున ఆరోపణలపై అశ్నీర్ గ్రోవర్ స్పందించారు. భారత్‌పే చేస్తున్న ప్రచారాన్ని బట్టి నేను స్టేడియం దగ్గరర పది ఇవరై పది ఇవరై అంటూ పాసులు అమ్ముకున్నానా? ఎందుకీ చిల్లర ఆరోపణలు ? కపటత్వాన్ని ఇకనైనా ఆపండి అంటూ భారత్‌పే బోర్డుకు సూచించాడు. ఈ మేరకు మ్యాచ్ జరుగుతున్నప్పుడు వీఐపీ స్టాండ్‌లో తాను ఉన్నప్పటి ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేశాడు అశ్నీర్ గ్రోవర్.
Just tell us whether or not we keep invested on BharatPe? Many small investors invested because of you.
— Raj (@Raj_Chen) March 17, 2022
మీకు బాధ్యత లేదా
బోర్డులో తలెత్తిన లుకలుకలతో గత మూడు నెలలుగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. దీనిపై భారత్‌పేలో ఇన్వెస్ట్ చేసిన ముదుపరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిమ్మల్ని నమ్మి మీ కంపెనీలో మా డబ్బులు ఇన్వెస్ట్ చేశాం. అది మరిచి మీరు వ్యక్తిగత దూషణలతో కంపెనీ ప్రతిష్ట దిగజార్చుతున్నారు. బాధ్యతగా వ్యవహరించండి అంటూ సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment