
కంపెనీలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొవడంతో ఆశ్నీర్ గ్రోవర్‌ను అన్ని పొజిషన్ల నుంచి భారత్‌పే తొలిగించినా విషయం తెలిసిందే. కాగా భారత్ పే సహవ్యవస్థాపకుడు, షార్క్ టాంక్ ఇండియా హోస్ట్ ఆశ్నీర్ గ్రోవర్ వ్యవహారం ఇప్పట్లో సర్దుమనిగేలా లేదు.ఆశ్నీర్‌పై అనేక ఆరోపణలు మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి.తాజాగా ఒక డైనింగ్ టేబుల్ కొనేందుకు ఏకంగా రూ. 10 కోట్ల రూపాయలను గ్రోవర్ ఖర్చు చేశాడనే వార్తలు తెరపైకి వచ్చాయి. కాగా ఈ వ్యవహారంపై ఆశ్నీర్ గ్రోవర్ తనదైన శైలిలో ట్విటర్‌లో స్పందించాడు.
మోసపోవద్దు..!
డైనింగ్ టేబుల్‌పై రూ. 10 కోట్లను ఖర్చు చేశాడనే వ్యాఖ్యలను ఆశ్నీర్ గ్రోవర్ తిప్పి కొట్టారు. ఆశ్నీర్ తన ట్విట్‌లో..ఇది స్పేస్ రాకెట్టా..లేక టైం మెషినా..? జస్ట్ రూ. 10 కోట్ల విలువైన డైనింగ్ టేబుల్! అత్యంత ఖరీదైన డైనింగ్ టేబుల్‌ను కల్గిన గిన్నిస్ వరల్డ్ రికార్డు నాపై లేదు.నాకు అలాంటి ఉద్దేశం కూడా లేదు..భారత్‌పే బోర్డు సభ్యులు తనపై చేస్తోన్న ఆరోపణలపై మోసం పోవద్దు.ఒక వేళ మీరు ఆ వార్తలను నమ్మితే కంపెనీలాగా మీరు కూడా విశ్వసనీయతను కోల్పోతారంటూ మీడియాకు ఆశ్నీర్ గ్రోవర్ విన్నవించారు. అంతేకాకుండా తన వాటాలో అది కూడా 0.5 శాతం విలువ కూడా చేయదంటూ తెలిపాడు. ఆ టేబుల్‌కు వెచ్చించే పది కోట్ల రూపాయలతో 1000 మందికి ఉపాధి కలిగేలా చేస్తానని పేర్కొన్నారు.
It’s not even worth 0.5% of that. I’d rather put ₹10cr in business and create employment for 1,000 of folks so that they can earn & put dignified meal on their tables for their families. Score; Self Goal (Loss of Credibility) by BharatPe Board / Investors - 1 : Lavishness - 0.
— Ashneer Grover (@Ashneer_Grover) March 13, 2022
ఇదిలా ఉండగా కొద్ది రోజలు క్రితం ఆశ్నీర్ గ్రోవర్ కంపెనీ డబ్బులతో లగ్జరీకారును, 10 కోట్ల విలువైన డైనింగ్ టేబుల్‌ను కొన్నాడంటూ బ్లూమ్‌బర్గ్‌తో సహా పలు మీడియా సంస్థలు రాసుకొచ్చాయి.
చదవండి: ఒక కప్పు కాఫీ ఎక్కువ తాగితే ఫైన్ కట్టాల్సిందే.. కొంపముంచిన కక్కుర్తి
Comments
Please login to add a commentAdd a comment