ఛార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరియాలి మరణంతో యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా (ఈవై)సంస్థలో పని వాతావరణంపై చర్చ కొనసాగుతుంది. ఆ సంస్థ మాజీ ఉద్యోగులు సైతం వర్క్ కల్చర్‌పై తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ తరుణంలో భారత్‌పే మాజీ సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ కోటి రూపాయల వేతనంతో చేరిన రెండో రోజే ఆ సంస్థ నుంచి బయటకు వచ్చారు. అయినా ఆ వర్క్ కల్చర్‌పై ప్రశంసలు కురిపిస్తూ అష్నీర్ గ్రోవర్ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోని సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే ఆర్‌పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయోంకా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
అన్నా సెబాస్టియన్ పెరియాలి మరణం సంస్థల్లో పని భారం వల్లేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై హర్ష్ గోయోంకా స్పందిస్తూ.. అష్నీర్ గ్రోవర్ మాట్లాడిన వీడియోని ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఆ వీడియోలో అష్నీర్ గ్రోవర్ మాట్లాడుతూ.. తాను రూ. కోటి వేతనంతో యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా కంపెనీలో ఉద్యోగిగా చేరిన తొలిరోజే బయటకు వచ్చిన నిర్ణయాన్ని వెల్లడించారు.
It’s baffling to see anyone advocate for a toxic environment. #AnnaPerayil
Your views? pic.twitter.com/QhPnCeKhxq— Harsh Goenka (@hvgoenka) September 19, 2024
చేరిన మొదటి రోజు ఆఫీసు మొత్తం కలియతిరిగాను. చుట్టూ చూశాను. అక్కడి వాతావారణం నాకు నచ్చలేదు. వెంటనే ఎదో ఒక్కటి చెప్పాలని.. నాకు గుండె నొప్పి వస్తుందని చెప్పి నటించాను.’ అని అన్నారు. కార్యాలయ వాతావరణం ఎలా ఉంటుందో వివరిస్తూ ఇలాంటి పని వాతావరణంతో ఉద్యోగులు ప్రాణాలు పోవడమేనని అర్ధం వచ్చేలా వ్యాఖ్యానించారు. అంతే కాదు.. ఒక కంపెనీలో వర్క్ గురించి చెడుగా చెబుతున్నారంటే అది మంచిదని అర్థం అని అష్నీర్ గ్రోవర్ అన్నారు.
విషపూరితమైన పని వాతావరణాన్ని ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేసిన అష్నీర్‌పై గోయెంకా ఆగ్రహం వ్యక్తం చేశారు. విషపూరిత వాతావరణం గురించి ఇలా పాజిటీవ్‌గా మాట్లాడడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని కామెంట్ చేశారు. ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదీ చదవండి : ఉద్యోగి అంత్యక్రియలకు వెళ్లని కంపెనీపై విమర్శలు
Comments
Please login to add a commentAdd a comment