EY India
-
Budget 2025: వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గింపు!
న్యూఢిల్లీ: రానున్న కేంద్ర బడ్జెట్లో (Budget 2025) మూలధన వ్యయాలు, పన్ను చట్టాల సరళతరం, వ్యక్తిగత ఆదాయపన్ను (income taxe) తగ్గింపు ప్రతిపాదనలకు చోటు కల్పించొచ్చని ఈవై ఇండియా అంచనా వేసింది. ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలకు పన్నుల ఉపశమనం తప్పనిసరి అని పేర్కొంది.2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను వచ్చే నెల 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనుండడం తెలిసిందే. దీంతో బడ్జెట్ అంచనాలతో ఈవై ఇండియా ఒక నోట్‌ను విడుదల చేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.31 లక్షల కోట్ల మేర ఆదాయపన్ను వివాదాల రూపంలో చిక్కుకుపోయినట్టు చెప్పింది. ఆదాయపన్ను కమిషనర్ (అప్పీళ్లు) సత్వరమే వీటిని పరిష్కరించాలని, ప్రత్యామ్నాయ పరిష్కార యంత్రాంగాలను తీసుకురావాలని సూచించింది.‘‘ప్రత్యక్ష పన్నుల కోడ్ సమగ్ర సమీక్షకు సమయం తీసుకోవచ్చు. కాకపోతే ఈ దిశగా ఆరంభ నిర్ణయాలకు బడ్జెట్లో చోటు ఉండొచ్చు. వ్యక్తిగత ఆదాయపన్నును సైతం తగ్గించొచ్చు. తక్కువ ఆదాయ వర్గాలకు ఉపశమనంతోపాటు డిమాండ్‌కు ఊతం ఇచ్చేందుకు వీలుగా చర్యలు ఉండొచ్చు’’అని ఈవై ఇండియా నేషనల్ ట్యాక్స్ లీడర్ సమీర్ గుప్తా తెలిపారు.ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే విధంగా వ్యూహాత్మక సంస్కరణలపై బడ్జెట్లో దృష్టి సారించొచ్చన్నారు. ద్రవ్య స్థిరీకరణకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా స్థిరమైన ఆర్థిక వృద్ధికి తగిన నిర్మాణాత్మక చర్యలు ఉండొచ్చన్నారు.పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు.. ముఖ్యంగా పన్నుల విధానాన్ని సులభంగా మార్చడం, కస్టమర్ల సేవలను మెరుగుపరచడం, వివాదాలను తగ్గించడం, పన్ను నిబంధనల అమలును పెంచడం దిశగా ప్రభుత్వం చర్యలు ప్రకటించొచ్చని ఈవై ఇండియా అంచనా వేస్తోంది. పన్ను చట్టాల సులభీకరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రజల నుంచి సూచనలను ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేసింది.ప్రైవేటు రంగ పెట్టుబడులను ప్రోత్సహించడం, వ్యాపార ఆవిష్కరణలను ప్రోత్సహించడంపై కీలకంగా దృష్టి సారించాలని పేర్కొంది. గత బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం మూలధన లాభాల విధానాన్ని హేతుబద్దీకరించడానికి ప్రాధాన్యం ఇచ్చినట్టు చెబుతూ.. ఈ దిశగా మరిన్ని చర్యలు రాబోయే బడ్జెట్లో ఉండొచ్చని తెలిపింది. ముఖ్యంగా ఎస్ఎంఈలకు పన్నుల సంక్లిష్టతను తగ్గించడం ఎంతో అవసరమని అభిప్రాయపడింది. -
‘వారానికి 40 గంటలే పని ఉండాలి!’
పని భారం.. తీవ్ర ఒత్తిడితో ఓ యువ ఉద్యోగిణి ప్రాణం కోల్పోవడం దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ భిన్నంగా స్పందించారు.పని ఒత్తిడితో యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా ఉద్యోగి మరణించిన ఘటనపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. పని ప్రదేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరగొద్దని సూచించిన ఆయన.. పనివేళలపై పార్లమెంట్లో చట్టం తెచ్చేందుకు కృషిచేస్తానన్నారు. ఈ క్రమంలో వారానికి 40 గంటల పని దినాల ప్రతిపాదన తెరపైకి తెచ్చారాయన.Had a deeply emotional and heartrending conversation with Shri Sibi Joseph, the father of young Anna Sebastian, who passed away after a cardiac arrest, following four months of deeply stressful seven-day weeks of 14 hours a day at Ernst&Young. He suggested, and I agreed, that I…— Shashi Tharoor (@ShashiTharoor) September 20, 2024 నాలుగు నెలలు.. ఏడు రోజులు.. రోజుకి 14 గంటల చొప్పున పని చేయడంతోనే ఆమె ఒత్తిడికి గురైంది. ఆమె మృతిపై విచారం వ్యక్తం చేస్తున్నా. అందుకే వారానికి ఐదు రోజులే పని దినాలు ఉండాలి. ప్రభుత్వ/ప్రైవేట్ ఉద్యోగులు రోజుకు ఎనిమిది గంటలే పని చేయాలి. ఈ దిశగా చట్టం కోసం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో నా వంతు కృషి చేస్తా.. అని తన ఎక్స్ ఖాతాలో ఆయన ఒక సందేశం కూడా ఉంచారు. అంతేకాదు ఇదే అంశంపై అన్నా తండ్రి సిబి జోసెఫ్‌తోనూ తాను మాట్లాడినట్లు థరూర్ తెలిపారు.కేరళకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరయిల్(26) నాలుగు నెలలుగా పూణే ఈవై కార్యాయలంలో పని చేస్తూ.. జులై నెలలో కన్నుమూసింది. అయితే పని ఒత్తిడి వల్లే అన్నా మరణించిందని ఆమె తల్లి అనిత ఈవై ఇండియా చైర్మన్ రాజీవ్ మెమానీకి లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది.ఇక.. ఈ వ్యవహారంపై కేంద్ర కార్మిక శాఖ విచారణ చేపట్టింది. మరోవైపు తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో రాజీవ్ మెమానీ స్పందించారు. ‘‘ఆమె కుటుంబంతో మాట్లాడాను. సెబాస్టియన్ మృతికి సంతాపం తెలిపాను. వారి జీవితంలో ఏర్పడిన వెలితిని ఎవరూ పూడ్చలేరు. ఆమె అంత్యక్రియల సమయంలో మేము అక్కడ లేకపోవడంపై తీవ్ర విచారం వ్యక్తంచేస్తున్నాను. ఇది మా పని సంస్కృతికి పూర్తిగా విరుద్ధం. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. భవిష్యత్తులో ఇలా జరగదు’’ అని సంస్థ మెమానీ పేర్కొన్నారు. తెరపైకి నారాయణమూర్తి కామెంట్స్పని ఒత్తిడితో ఈవై ఉద్యోగిణి మరణించడం చర్చనీయాశంగా మారిన వేళ.. పనిగంటలపై ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గతంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచ దేశాలతో పోటీ పడాలన్నా.. అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలవాలన్నా.. భారత్‌లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాల్సిందేనని అన్నారాయన. ‘‘ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత తక్కువ. అందుకే దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ వంటి దేశాలు ఎలాగైతే కష్టపడ్డాయో.. చైనా వంటి దేశాలతో పోటీపడాలంటే మన యువత అదే తరహాలో పనిచేయాల్సిన అవసరం ఉంది. ‘ఇదీ నా దేశం. నా దేశం కోసం వారానికి 70 గంటలు కష్టపడతా’ అనే అనే ప్రతిజ్ఞ చేయాలి’’ అని నారాయణమూర్తి అన్నారు. ఆ సమయంలో ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.వారానికి 100 గంటలైనా పని చేయాలంటూ ఎలోన్ మస్క్ లాంటి బిలియనీర్లు పిలుపు ఇస్తుంటారు. కానీ, ఓవర్ వర్క్ వల్ల గుండె, మెదడు ఇతర కీలకమైన అవయవాలపై ఒత్తిడి పడుతుంది. చివరకు.. మరణానికి కూడా దారి తీయొచ్చు. మొన్నీమధ్య చైనాలోనూ ఓ పెయింటర్ ఇలా గొడ్డు చాకిరీ చేసే ప్రాణం పొగొట్టుకున్నాడు. ఆరా తీస్తే.. వరుసగా 104 రోజులు పని చేసిన ఆ కిందిస్థాయి ఉద్యోగి.. ఒకే ఒక్కరోజు సెలవు తీసుకున్నాడని తేలింది. ఇదీ చదవండి: కోటి జీతం.. అయినా ఈవై ఉద్యోగం వద్దనుకున్నాడు!! -
EY సంస్థకో దణ్ణం..రూ.కోటి జీతంతో చేరిన రెండో రోజే గుండెలో నొప్పిగా ఉందంటూ
ఛార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరియాలి మరణంతో యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా (ఈవై)సంస్థలో పని వాతావరణంపై చర్చ కొనసాగుతుంది. ఆ సంస్థ మాజీ ఉద్యోగులు సైతం వర్క్ కల్చర్‌పై తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో భారత్‌పే మాజీ సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ కోటి రూపాయల వేతనంతో చేరిన రెండో రోజే ఆ సంస్థ నుంచి బయటకు వచ్చారు. అయినా ఆ వర్క్ కల్చర్‌పై ప్రశంసలు కురిపిస్తూ అష్నీర్ గ్రోవర్ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోని సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయోంకా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.అన్నా సెబాస్టియన్ పెరియాలి మరణం సంస్థల్లో పని భారం వల్లేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై హర్ష్ గోయోంకా స్పందిస్తూ.. అష్నీర్ గ్రోవర్ మాట్లాడిన వీడియోని ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఆ వీడియోలో అష్నీర్ గ్రోవర్ మాట్లాడుతూ.. తాను రూ. కోటి వేతనంతో యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా కంపెనీలో ఉద్యోగిగా చేరిన తొలిరోజే బయటకు వచ్చిన నిర్ణయాన్ని వెల్లడించారు.It’s baffling to see anyone advocate for a toxic environment. #AnnaPerayil Your views? pic.twitter.com/QhPnCeKhxq— Harsh Goenka (@hvgoenka) September 19, 2024చేరిన మొదటి రోజు ఆఫీసు మొత్తం కలియతిరిగాను. చుట్టూ చూశాను. అక్కడి వాతావారణం నాకు నచ్చలేదు. వెంటనే ఎదో ఒక్కటి చెప్పాలని.. నాకు గుండె నొప్పి వస్తుందని చెప్పి నటించాను.’ అని అన్నారు. కార్యాలయ వాతావరణం ఎలా ఉంటుందో వివరిస్తూ ఇలాంటి పని వాతావరణంతో ఉద్యోగులు ప్రాణాలు పోవడమేనని అర్ధం వచ్చేలా వ్యాఖ్యానించారు. అంతే కాదు.. ఒక కంపెనీలో వర్క్ గురించి చెడుగా చెబుతున్నారంటే అది మంచిదని అర్థం అని అష్నీర్ గ్రోవర్ అన్నారు. విషపూరితమైన పని వాతావరణాన్ని ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేసిన అష్నీర్పై గోయెంకా ఆగ్రహం వ్యక్తం చేశారు. విషపూరిత వాతావరణం గురించి ఇలా పాజిటీవ్‌గా మాట్లాడడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని కామెంట్ చేశారు. ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదీ చదవండి : ఉద్యోగి అంత్యక్రియలకు వెళ్లని కంపెనీపై విమర్శలు -
ఎంత ఖర్చయినా పర్వాలేదు.. ఆరోగ్యం కావాలి!
Effect Of Corona: కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. ఆరోగ్యం కోసం మరింత ఎక్కవగా ఖర్చు పెట్టేందుకు వినియోగదారులు ఏ మాత్రం వెనుకాడడం లేదు. శారీరక, మానసిక ఆరోగ్యం దృఢంగా ఉండేందుకు శిక్షణ, సహజసిద్ధమైన ఆహారం, ఔషధాలు, ప్రత్యేకమైన ఆహర మెనూ కోసం ఖర్చు చేస్తున్నారు. కరోనా మహమ్మారి ఈ రకమైన మార్పునకు కారణమని ఈవై ఇండియా ‘ద సన్‌రైజ్ కన్జ్యూమర్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ సెక్టార్’ నివేదిక తెలియజేసింది. 94 శాతం మంది భారతీయులు తమ కుటుంబ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయంగా ఇది 82 శాతంగానే ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ కరోనా మహమ్మారి వెళ్లిపోయిన తర్వాత కూడా కొనసాగుతుందని 52 శాతం మంది భారతీయలు సర్వేలో తెలిపారు. అంతర్జాతీయంగా చూస్తే ఇలా చెప్పిన వారు 39 శాతంగా ఉన్నారు. భారతీయులు ఇంటి చిట్కాలు, పరిష్కారాలకు, ఆరోగ్యకరమైన ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆధునిక ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేదం, హెర్బల్ ఔషధాలే పరిష్కారమని భావిస్తున్నారు. ఆయుర్వేద ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో ఇప్పటికే ఈ రంగంలో పనిచేస్తున్న కంపెనీలకు ప్రోత్సాహకరంగా మారింది. ఆరోగ్యాన్నిచ్చే ఉత్పత్తులకు అధికంగా ఖర్చు పెట్టేందుకు తాము సుముఖమని 40 శాతం మంది తెలిపారు. అంతర్జాతీయంగా ఇలా 29 శాతం మందే చెప్పారు. ఈవై ఫ్యూచర్ కన్జ్యూమర్ ఇండెక్స్ (2021 నవంబర్) ఆధారంగా, అంతర్జాతీయంగా 16,000 మంది, భారత్ నుంచి 1,002 మంది అభిప్రాయాలను సర్వే కింద పరిగణనలోకి తీసుకున్నారు. పెద్ద ఎత్తున మార్పు ‘‘కొంత మంది ఇది స్వల్పకాలమేనని భావిస్తున్నారు. కానీ, మేము మాత్రం వ్యక్తిగత ఆరోగ్యం, పరిశుభ్రత, ఫిట్నెస్ విషయంలో వినియోగదారుల ధోరణిని ఈ దశ పెద్ద ఎత్తున మార్పును తీసుకొస్తుందని, వేగవంతం చేస్తుందని భావిస్తున్నాం’’ అని ఈవై ఇండియా నేషనల్ లీడర్ అన్షుమన్ భట్టాచార్య తెలిపారు. (చదవండి: భారీగా పడిపోతున్న క్రిప్టో కరెన్సీ ధరలు..!) -
ఎయిరిండియా విక్రయానికి కొత్త ప్రణాళిక
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియా విక్రయానికి కేంద్ర ఆర్థిక శాఖ మరో కొత్త ప్రణాళిక రూపకల్పనలో నిమగ్నమైంది. ఈ సారి చమురు ధరలు, మారకం రేటు హెచ్చు తగ్గులు తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. వాస్తవానికి ఎయిరిండియాలో గతేడాదే వాటాలు విక్రయించే ప్రయత్నాలు జరిగినప్పటికీ.. ఇలాంటి కారణాల వల్లే విఫలమైనట్లు కన్సల్టెన్సీ సంస్థ ఈవై తేల్చి చెప్పడంతో తాజా నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనలను ఎయిరిండియా ప్రత్యేక ప్రత్యామ్నాయ యంత్రాంగం (ఏఐఎస్ఏఎం) ముందు ఆర్థిక శాఖ ఉంచనుంది. ఎయిరిండియాలో మొత్తం 100 శాతం వాటాలు లేదా 76 శాతం వాటాలు విక్రయించాలా అన్న ఆప్షన్ కూడా వీటిలో ఉంటుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురితో పాటు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కొత్తగా ఏర్పడే ఏఐఎస్‌ఏఎంలో సభ్యులుగా ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎయిరిండియాకు మొత్తం రూ. 55,000 కోట్ల మేర రుణభారం ఉంది. ఎయిరిండియాలో 76 శాతం వాటాలు విక్రయించేందుకు 2018లో కేంద్రం ప్రయత్నించింది. అయితే, కొనుగోలుదారు దాదాపు రూ. 30,000 కోట్ల రుణభారాన్ని భరించాల్సి రానుండటంతో విక్రయ ప్రయత్నాలు విఫలమయ్యాయి. -
ఈవైపై ఎన్ఎస్ఈఎల్ ఇన్వెస్టర్ల ఫిర్యాదు
ముంబై: చెల్లింపుల సంక్షోభంలో చిక్కుకున్న నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈఎల్) వివాదంలో తాజాగా ఆడిటింగ్ సంస్థ ఎర్న్స్ట్ అండ్ యంగ్ ఇండియా (ఈవై) ఇరుక్కుంది. ఈ కుంభకోణంలో ఈవై పాత్ర కూడా ఉందంటూ ఎన్ఎస్ఈఎల్ స్కాములో మోసపోయిన ఇన్వెస్టర్ల ఫోరం .. ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ)కి ఫిర్యాదు చేసింది. అయితే, ఈవై తమపై ఆరోపణలను ఖండించింది. దేశీయంగా కమోడిటీ ఫైనాన్సింగ్‌పై తాము ఇచ్చిన నివేదికలో తప్పులేమీ లేవని స్పష్టం చేసింది. ఎస్వీ ఘటాలియా అండ్ అసోసియేట్స్ చేసిన ఎన్ఎస్ఈఎల్ ఆడిటింగ్‌కి తమ నివేదికకు ఎలాంటి సంబంధమూ లేదని పేర్కొంది.