భారత్‌పే బోర్డులో మొదలైన ముసలం ఇంకా చల్లారడం లేదు. అవినీతి ఆరోపణలపై బోర్డు నుంచి బయటకు నెట్టబడిన ఆ కంపెనీ మాజీ ఫౌండర్ ఆశ్నీర్ గ్రోవర్ ప్రస్తుతం బోర్డులో ఉన్న సభ్యులపై వరుసగా పంచ్‌లు విసురుతున్నారు. ఈ క్రమంలో మరోసారి ఊరమాస్ పంచ్ డైలాగులతో విరుచుకుపడ్డారు.
ఈ ఏడాదికి సంబంధించిన తొలి త్రైమాసిక ఫలితాలను ఇటీవల భారత్‌పే ప్రకటించింది. ఈ ఫలితాల్లో క్షీణత కనిపించింది. దీన్ని అవకాశంగా మలుచుకున్న ఆశ్నీర్ గ్రోవర్ ట్విట్టర్‌లో రెచ్చిపోయారు. భారత్‌పే ఫస్ట్ క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. రజనీష్‌కుమార్, సుహైల్ సమీర్ వంటి అసమర్థుల నాయకత్వంలో భారత్‌పే ఫలితాలో క్షీణత కనిపిస్తోంది. కంపెనీ నిధులు ఆవిరైపోతున్నాయి. తాళాలు దొంగలించడం. కార్నర్‌లో బడ్డీ కొట్టు నిర్వహించడం రెండు ఒకటి కాదు. మీ నాన్నమ్మ గుర్తుకు వస్తుందా? మార్కెట్ మీకు అసలైన పరీక్ష పెడుతుంది. నిజాన్ని పట్టి చూపుతుంది అంటూ పంచ్ విసిరారు.
భారత్‌పే స్టార్టప్‌ను 2018లో ఆశ్నీర్ గ్రోవర్, శాశ్వత్ నక్రానీలు స్థాపించారు. ఆ తర్వాత 2020లో భారీగా ఇన్వెస్ట్ చేసిన సుహైల్ సమీర్ భారత్‌పే గ్రూపు చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత క్రమంగా భారత్‌పే బోర్డులో లుకలుకలు మొదలయ్యాయి. చివరకు 2022 జనవరిలో భారత్‌పే నుంచి అశ్నీర్‌గ్రోవర్‌ను బలవంతంగా బయటకు పంపారు. దీంతో అవకాశం చిక్కినప్పుడల్లా అశ్నీర్ గ్రోవర్ పంచ్‌లు వేస్తున్నారు. తాజాగా భారత్‌పే సీఈవో సుహైల్ సమీర్, చైర్‌పర్సన్ హోదాలో ఉన్న రజనీష్ కుమార్ లక్ష్యంగా మాటల తూటాలు పేల్చారు.
So I just heard @bharatpeindia closed it’s first quarter of ‘degrowth’ and ‘maximum cash burn’ under able (sic) leadership of Rajnish Kumar and Suhail Sameer. ‘Chaabi chheenna and hatti chalana do alag alag skills hai !’ Ab Nani yaad aayegi - markets are the ultimate test & truth
— Ashneer Grover (@Ashneer_Grover) April 7, 2022
Comments
Please login to add a commentAdd a comment