యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం
చినకాకాని (మంగళగిరి) : యోగాతోనే మానవుడు సంపూర్ణ ఆరోగ్యంతో ప్రశాంతంగా జీవనం సాగిస్తాడని యోగా మాస్టర్ సీవీవీ అన్నారు. మండలంలోని చినకాకాని హాయ్‌ల్యాండ్‌ల ఉదయం ప్రభాకర్ ధ్యానమండలి ఆధ్వర్యంలో 17వ జాతీయ యోగా కార్యకమాన్ని ఆయన ప్రారంభించారు. యోగా చేసేవారంతా ఒకేచోట చేరి యోగా చేయాలనే లక్ష్యంతో ఇప్పటికి 16 సార్లు వివిధ ప్రాంతాలలో సర్వసాధక సత్యయోగ వేదికను నిర్వహించామన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి 1,200 మంది యోగసాధకులు హాజరవగా యోగా గురువులు సీఎస్ జయకుమార్, ఆర్‌ఎస్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.