Ban Vs Pak: Bangladesh Fans Trolls On Pakistan Team For Using National Flag On The Ground - Sakshi
Sakshi News home page

BAN vs PAK: ప్రాక్టీస్‌లో పాకిస్తాన్‌ జెండా.. క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం

Published Tue, Nov 16 2021 5:40 PM | Last Updated on Tue, Nov 16 2021 6:49 PM

Bangladesh Fans Not Impressed Pakistan Team Plants National Flag Practice - Sakshi

Bangla Fans Troll Pakistan Team Plants National Flag During Practice.. టి20 ప్రపంచకప్‌ 2021లో సెమీస్‌లో ఓడి ఇంటిబాట పట్టిన పాకిస్తాన్‌ నేరుగా బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టింది. బంగ్లా పర్యటనలో పాకిస్తాన్‌ జట్టు మూడు టి20లు.. రెండు టెస్టులు ఆడనుంది. నవంబర్‌ 19 నుంచి ఈ సిరీస్‌ మొదలుకానుంది. ఇప్పటికే సిరీస్‌లో ఆడనున్న ఆటగాళ్లు శనివారం ఢాకాకు చేరుకొని ప్రాక్టీస్‌ ప్రారంభించారు. ఇక షోయబ్‌ మాలిక్‌, బాబర్‌ అజమ్‌లు మాత్రం మంగళవారం ఢాకాకు రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్‌ ప్రారంభించిన పాక్‌ ఆటగాళ్లు మైదానంలో వారి జాతీయ జెండాను పెట్టడం వివాదాస్పదంగా మారింది.

చదవండి: T20 WC 2021: నా కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌.. అతడే అత్యుత్తమ బౌలర్‌.. 

పాకిస్తాన్‌ కోచ్‌ సక్లెయిన్‌ ముస్తాక్‌ ఆటగాళ్లకు దేశంపై గౌరవం ఎల్లవేలలా కనపడాలనే ఉద్దేశంతో ఇలా చేసినట్లు తెలిసింది. అయితే దీనిపై బంగ్లా క్రికెట్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ''బంగ్లాదేశ్‌లో క్రికెట్‌ ఆడడానికి ఎన్నో జట్లు వచ్చాయి. కానీ ఏ జట్టు తమ జాతీయ జెండాను ప్రాక్టీస్‌ సందర్భంగా మైదానంలోకి తీసుకురాలేదు. కానీ పాకిస్తాన్‌ మాత్రమే ఎందుకు ఈ పని చేసింది. పాక్‌ చర్య మాకు నచ్చలేదు.. బంగ్లాదేశ్‌తో సిరీస్‌ రద్దు చేసుకొని మీ దేశానికి వెళ్లిపోండి..'' అంటూ ఒకరు కామెంట్‌ చేశారు. '' బంగ్లాదేశ్‌లో పాకిస్తానీ ఫ్లాగ్‌ను బ్యాన్‌ చేయండి'' అంటూ ట్విటర్‌లో మరొక అభిమాని ఆగ్రహంతో పేర్కొన్నాడు.  

ఇక టి20 ప్రపంచకప్‌ 2021లో సూపర్‌ 12 దశలో దుమ్మురేపిన పాకిస్తాన్‌ ఐదు  మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించి సెమీస్‌కు చేరింది. అయితే సెమీస్‌లో మాత్రం  ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. 

చదవండి: Usman Shinwari Retirement: టెస్టులకు గుడ్‌బై చెప్పిన పాక్‌ క్రికెటర్‌

పాకిస్థాన్ టి20 జట్టు: బాబర్ అజమ్‌ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, హసన్ అలీ, ఇఫ్తీకర్ అహ్మద్, ఇమాద్ వాసిం, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్(వికెట్‌ కీపర్‌), మహ్మద్ వసీం జూనియర్, సర్ఫరాజ్ అహ్మద్ , షాహీన్ షా ఆఫ్రిది, షానవాజ్ దహానీ, షోయబ్ మాలిక్, ఉస్మాన్ ఖాదిర్

పాకిస్థాన్ టెస్టు జట్టు: బాబర్ అజమ్‌ (కెప్టెన్‌), అబ్దుల్లా షఫీక్, అబిద్ అలీ, అజహర్ అలీ, ఫవాద్ ఆలం, ఇమామ్-ఉల్-హక్, కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌ కీపర్‌), సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్‌ కీపర్‌), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, బిలాల్ ఆసిఫ్ , హసన్ అలీ, మహ్మద్ అబ్బాస్, నసీమ్ షా, నౌమాన్ అలీ, షాహీన్ షా ఆఫ్రిది, జాహిద్ మహమూద్, సాజిద్ ఖాన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement