నైట్‌ షూట్‌లో బాక్సర్‌ | Varun Tej shoot for night shedule | Sakshi
Sakshi News home page

నైట్‌ షూట్‌లో బాక్సర్‌

Published Mon, Nov 9 2020 6:26 AM | Last Updated on Mon, Nov 9 2020 6:26 AM

Varun Tej shoot for night shedule - Sakshi

వరుణ్‌ తేజ్‌ హీరోగా నూతన దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి డైరెక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. అల్లు వెంకటేశ్, సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు.  ఇందులో వరుణ్‌ బాక్సర్‌గా కనిపిస్తారు. ఈ సినిమా కోసం బాక్సర్‌గా మారడానికి పలువురు బాక్సింగ్‌ ఫ్రొఫెషనల్స్‌ దగ్గర శిక్షణ కూడా తీసుకున్నారు వరుణ్‌. బాలీవుడ్‌ నటి సాయి మంజ్రేకర్‌ ఇందులో కథానాయిక. ఉపేంద్ర, సునీల్‌ శెట్టి, నదియా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రస్తుతం నైట్‌ షెడ్యూల్‌లో పలు సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మరికొన్ని రోజుల పాటు ఈ షెడ్యూల్‌ సాగనుంది. హైదరాబాద్‌ షెడ్యూల్‌ తర్వాత ఢిల్లీలోనూ చిత్రీకరణ ప్లాన్‌ చేస్తున్నట్టు తెలిసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement