మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ఓ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. VT13 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఫైటర్ పైలట్‌గా కనిపించనున్నాడు. వరుణ్ తేజ్ కెరీర్‌లో 13వ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్‌డేట్‌ను వదిలారు.
ఇప్పటివరకు ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్నదాన్ని రివీల్ చేయలేదు. దీంతో వరుణ్‌కు జోడీగా నటించనున్న ఆ హీరోయిన్ పేరును రేపు ఉదయం 10:06 గంటలకు వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.
ఈ మేరకు ఓ హీరోయిన్ ఎవరనే సస్పెన్స్‌తో ఓ వీడియోను రిలీజ్ చేశారు. దీంతో ఈ మ్యూటీ అదిరి రావ్ హైదరీ అని కొందరు అంటే, మరికొందరేమో లావణ్య త్రిపాఠి అని కామెంట్ చేస్తున్నారు. చూడాలి రి వరుణ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో రేపు(శుక్రవారం)తెలియనుంది.
#vt13newrecruit pic.twitter.com/zddAvLGSte
— Varun Tej Konidela (@IAmVarunTej) March 2, 2023
Comments
Please login to add a commentAdd a comment