మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గని'. వరుణ్ తేజ్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ నటించింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో సిద్దు, అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలకు అభిమానులు, సినీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 8న విడుదల కానుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన నవీన్ చంద్ర చెప్పిన విశేషాలు.
చదవండి: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కోసం ఐకాన్ స్టార్..
మా మామయ్యగారు టి. శివకుమార్ బాక్సర్. ఆయన్ను చూసి, నేను బాక్సర్ అవ్వాలనుకున్నాను. కానీ యాక్టర్ అయ్యాను. ‘గని’లో ఆది అనే బాక్సర్ పాత్ర పోషించడంతో నేను బాక్సర్ కావాలన్న ఆశ తీరినట్లయింది. ఆది క్యారెక్టర్ నెగటివ్ షేడ్స్‌తో ఉంటుంది. లాక్‌డౌన్స్ వల్ల ‘గని’ షూటింగ్‌కు కాస్త ఇబ్బందులు కలిగాయి. దీంతో బాక్సర్‌గా చాలా రోజులు ఫిట్‌గానే ఉండటం చాలెంజింగ్‌గా అనిపించింది. అలాగే నిజమైన బాక్సర్స్‌లా కనిపించాలని జాతీయ స్థాయి బాక్సర్స్‌తో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను.
ప్రతి రోజూ పరీక్షలే! ..
వరుణ్ అమేజింగ్ యాక్టర్. సెట్స్‌లో దెబ్బలు తగలకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. అలానే కరోనా నిబంధనలు పాటిస్తూ, షూటింగ్ చేసినప్పుడు సిద్ధు, అల్లు బాబీగార్లు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతిరోజూ యూనిట్‌లో అందరికీ కరోనా పరీక్షలు చేయించేవారు.
అరవింద..తో నటుడిగా మెరుగయ్యాను..
‘అరవింద సమేత వీర రాఘవ’ యాక్టర్‌గా నన్ను మెరుగుపరిచింది. ‘గని’ చిత్రంలోని ఆది క్యారెక్టర్ మరో ఎక్స్‌పీరియన్స్. డేట్స్ కుదరకపోవడం వల్ల తమిళ హిట్ మూవీ ‘సారపట్ట పరంపర’లో అవకాశాన్ని కోల్పోయాను. రామ్‌చరణ్‌గారు హీరోగా శంకర్‌గారి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నాను. ఏప్రిల్ 7న మొదలైయ్యే అమృత్‌సర్ షెడ్యూల్‌లో నేను పాల్గొంటాను. ఇక నేను హీరోగా చేసిన నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరో నాలుగు ప్రాజెక్ట్స్ సెట్స్‌పై ఉన్నాయి.
చదవండి: పన్నెండేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను, కానీ ఫోకస్ కాలేదు
Comments
Please login to add a commentAdd a comment