![Priyanka Chopra to play villain against Mahesh Babu](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/Priyanka.jpg.webp?itok=8WUJowh5)
మహేశ్‌బాబు మూవీలో విలన్‌గా నటించనున్నారట ప్రియాంకా చోప్రా. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ ఫిల్మ్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా ఓ కీలక పాత్రకు ఎంపికయ్యారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇటీవల ప్రియాంకా చోప్రా హైదరాబాద్ రావడం, కొన్ని రోజులు ఇక్కడే ఉండటం వంటి అంశాలు ఈ మూవీలో ఆమె భాగమయ్యారనే విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేస్తున్నట్లుగా ఉన్నాయి.
కాగా ఈ మూవీలో ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ ఆమె చేయనున్నది హీరోయిన్ రోల్ కాదని, నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ రోల్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఇటీవల మహేశ్–ప్రియాంక పాల్గొనగా హైదరాబాద్‌లో షూట్ జరిగింది. ఇది టెస్ట్ షూట్ అని, కాదు రెగ్యులర్ షూట్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment