
ఆలియా భట్, షార్వరి లీడ్ రోల్స్‌లో ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా తెరకెక్కనుందనే టాక్ బాలీవుడ్‌లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. యశ్ రాజు ఫిలింస్ స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్‌గా నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. ఈ ఏడాది చివర్లోనే ఈ సినిమా చిత్రీకరణప్రారంభం కానుందట. శివ్ రావైల్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, ఆదిత్యా చోప్రా ఈ సినిమాను నిర్మించనున్నారు.
గతంలో ‘రాజీ’ సినిమాలో స్పై పాత్రలో నటించిన ఆలియా భట్ మళ్లీ ఈ సినిమాలో ఆ తరహా పాత్రను ఓకే చేయడం విశేషం. ఇక ‘యానిమల్’లో విలన్ రోల్‌లో బాబీ డియోల్ విజృంభించిన విషయం తెలిసిందే. మరి.. యశ్ రాజ్ ఫిలింస్ తాజా చిత్రంలో విలన్‌గా సై అంటే... మరోసారి బాబీ నెగటివ్ పెర్ఫార్మెన్స్‌ని చూసే వీలు దక్కుతుంది.
Comments
Please login to add a commentAdd a comment