RRR Actor Ray Stevenson Passes Away At 58 - Sakshi
Sakshi News home page

RRR నటుడు రే స్టీవెన్సన్‌ హఠాన్మరణం.. స్కాట్‌ దొర నేపథ్యం ఇది

Published Tue, May 23 2023 6:53 AM | Last Updated on Tue, May 23 2023 8:50 AM

RRR Actor Ray Stevenson passes away at 58 - Sakshi

ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వహించిన ట్రిపుల్‌ ఆర్‌ చిత్రంలో నటించిన విదేశీ నటుడు రే స్టీవెన్సన్‌(58) హఠాన్మరణం చెందారు. RRRలో ఆయన బ్రిటిష్‌ గవర్నర్‌ స్కాట్‌ బక్స్‌టన్‌ రోల్‌లో మెయిన్‌ విలన్‌ క్యారెక్టర్‌లో అలరించారు. కరడుగట్టిన ‘స్కాట్‌ దొర’ పాత్రగా అది ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. ఇటలీలో తన కొత్త చిత్రం ‘క్యాసినో’ షూటింగ్‌లో పాల్గొంటున్న ఆయన.. ఆదివారమే మరణించినట్లు తెలుస్తోంది. అయితే ఆయన మృతికి గల కారణాలు తెలియరాలేదు.

బ్రిటిష్‌ నటుడైన రే స్టీవెన్సన్‌ పూర్తి పేరు జార్జ్‌ రేమండ్‌ స్టీవెన్సన్‌. పలు చిత్రాలతో పాటు టెలివిజన్‌ సిరీస్‌ల్లోనూ ఆయన నటించారు. 1964 మే 25వ తేదీన నార్త్‌ ఐర్లాండ్‌లోని లిస్‌బర్న్‌లో స్టీవెన్సన్‌ జన్మించారు. ఆయన తండ్రి రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ పైలట్‌. తన 29వ ఏట బ్రిస్టల్‌ ఓల్డ్‌ విక్‌ థియేటర్‌ స్కూల్‌లో యాక్టింగ్‌ కోర్స్‌ పూర్తి చేశాడు రే స్టీవెన్సన్‌. 

స్టేజ్‌ ఆర్టిస్ట్‌గా మొదలైన స్టీవెన్సన్‌ యాక్టింగ్‌ కెరీర్‌.. క్రమంగా సినిమాల వైపు మళ్లింది. ది థియరీ ఫ్లైట్‌(1998) చిత్రంతో ఆయన సిల్వర్‌ స్క్రీన్‌ యాక్టింక్‌ కెరీర్‌ ప్రారంభమైంది. కింగ్‌ ఆర్థర్‌(2004)లో డాగోనెట్‌ రోల్‌లో ఆయన నటనకు మంచి గుర్తింపు, ప్రశంసలు దక్కాయి. హెచ్‌బీవో రోమ్‌ టీవీ సిరీస్‌లో టైటస్‌ పులోగా ఆయన అలరించారు. థోర్‌, స్టార్‌వార్స్‌ లాంటి హిట్‌ చిత్రాల్లోనూ ఆయన నటించారు.  సరిగ్గా ఇరవై ఏళ్ల పాటు స్టేజ్‌ నాటకాలతో, చిత్రాలతో, వెబ్‌ సిరీస్‌లతో అలరించారాయన.   

 స్టీవెన్‌సన్‌ బ్రిటిష్‌ నటి రుత్‌ గెమ్మెల్‌ను వివాహం చేసుకున్నారు. బాండ్‌ ఆఫ్‌ గోల్డ్‌ చిత్రంలో వీళ్ల పరిచయం కాస్త ప్రేమగా మారింది. 1997లో వీళ్ల వివాహం జరిగింది. అదే ఏడాది పీక్‌ ప్రాక్టీస్‌ అనే చిత్రంలోనూ వీళ్లు కలిసి నటించారు. అయితే ఎనిమిదేళ్ల తర్వాత వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకుంది ఈ జంట. వీళ్లకు ముగ్గురు సంతానం.

 

స్టీవెన్సన్‌ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్రిపుల్‌ ఆర్‌ చిత్రయూనిట్‌ సంతాపం వ్యక్తం చేసింది.  ‘సర్‌ స్కాట్‌.. మీరెప్పుడూ మా గుండెల్లో నిలిచి ఉంటార’ని ట్వీట్‌లో పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement