గల్లా కుటుంబానికి ఘట్టమనేని షాక్! | ghattamaneni family shock to galla jayadev | Sakshi
Sakshi News home page

గల్లా కుటుంబానికి ఘట్టమనేని షాక్!

Published Mon, May 5 2014 11:47 AM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

గల్లా కుటుంబానికి ఘట్టమనేని షాక్! - Sakshi

గల్లా కుటుంబానికి ఘట్టమనేని షాక్!

గల్లా కుటుంబానికి ఘట్టమనేని వారు షాక్ యిచ్చారు. తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచిన ఇంటల్లుడిని ఊరించి ఉస్సూరనిపించారు. స్టార్ ఇమేజ్ను క్యాష్ చేసుకోవాలనుకున్న గల్లా జయదేవ్ ఆశలపై ఆయన మామ సూపర్ స్టార్ కృష్ణ, ప్రిన్స్ మహేష్బాబు నీళ్లు చల్లారు. తొలిసారిగా ఎన్నికల బరిలో దిగిన జయదేవ్ సినిమా గ్లామర్పై ఎక్కువగా ఆధారపడ్డారు. తన అత్తింటివారు చిత్రసీమకు చెందినవారు కావడంతో ఆయన ఆశలు పెట్టుకున్నారు.

తనకు మద్దతుగా కృష్ణ, మహేష్బాబు ప్రచారం చేస్తారని భావించారు. అయితే జయదేవ్కు వారు చేయిచ్చారు. ముఖ్యంగా తన బావమరిది మహేష్ తన తరపున ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జయదేవ్ భావించారు. యూత్లో మహేష్కు ఉన్న ఫాలోయింగ్ తనకు ప్లస్ అవుతుందనుకున్నారు. కానీ ప్రిన్స్ ప్రచారం ఊసే ఎత్తలేదు. తన బావకు ఓటు వేయమని ట్విటర్లో పోస్ట్ చేసి ఊరుకున్నాడు.

ఇక కృష్ణ కూడా ఎన్నికల ప్రచారానికి వెళ్లలేదు. చివరి నిమిషంలో విలేకరుల సమావేశం పెట్టి తన అల్లుడికి ఓటు వేయాలని అభ్యర్థించారు. చంద్రగిరి నుంచి పోటీ చేస్తున్న తన వియ్యపురాలు గల్లా అరుణకు ఓటేయమని ఆయన చెప్పకపోవడం గమనార్హం. ఇక దర్శకుడు కె. రాఘవేంద్రరావు, మరో సినిమా రచయిత తెర వెనుకుండి గల్లా జయదేవ్ ఎన్నికల ప్రచారాన్ని నడిపించారు. సొంతవారు రాకపోయినా సినిమావాళ్ల సహకారంతోనే జయదేవ్ ప్రచారం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement