Sitara Ghattamaneni Announced Mahesh Babu Foundation Official Website - Sakshi

Sitara Ghattamaneni: నాన్న ఫౌండేషన్‌ కోసం నా పాకెట్‌ మనీ డొనేట్ చేస్తున్నా: సితార

Jan 1 2023 9:45 PM | Updated on Jan 2 2023 9:08 AM

Sitara Ghattamaneni Announced Maheshbabu Foundation Official Website - Sakshi

మహేశ్ బాబు గారాల కూతురు సితార టాలీవుడ్‌ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో న్యూ ఇయర్‌ సెలబ్రేషన్‌ జరుపుకున్నారు. ఇటీవల సోషల్‌ మీడియాలో చురుక్కుగా ఉంటున్నారు సితార. అయితే చిన్నపిల్లల కోసం మహేశ్‌ బాబు ఫౌండేషన్‌ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 

తాజాగా మహేశ్‌ బాబు చేస్తున్న సేవా కార్యక్రమాల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ ప్రారంభిస్తున్నట్లు సితార సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. తన వంతుగా నా పాకెట్‌ మనీ డొనేట్ చేస్తున్నట్లు సితార ప్రకటించింది. ఈ నూతన సంవత్సరంలో మా అధికారిక వెబ్‌సైట్‌ http://maheshbabufoundation.org ప్రారంభించడం పట్ల మేము సంతోషిస్తున్నాం ‍అని సితార వెల్లడించింది. ఫౌండేషన్ తరఫున అందరికీ 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది సితార. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement