
సూపర్ స్టార్ మహేష్‌బాబుకు తన కుటుంబం ముఖ్యంగా పిల్లలతో గడపడం చాలా సరదా అనే సంగతి తెలిసిందే. షూటింగ్‌ల నుంచి ఏ మాత్రం విరామం దొరికిన పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తుంటారు ఈ రాజకుమారుడు. గతంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మహేష్ ఆయన సతీమణి నమ్రతనే పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూసుకుంటారని.. తనకు అవకాశం వస్తే పిల్లలను స్కూల్‌కి కూడా పంపించనని చెప్పిన సంగతి తెలిసింది. అంతేకాక మహేష్ తన పిల్లలను బాగా గారాబం చేస్తుంటారు. ఈ విషయాన్ని నిరూపించే ఫోటో ఒకదాన్ని నమ్రత శిరోద్కర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. దానితో పాటు ‘ఘర్ ఘర్ కి కహానీ(ప్రతి ఇంటిలో జరిగేదే).. పిల్లలు అడిగిన దానికి తల్లి ఒప్పుకోకపోతే వెంటనే జరిగే పని వెళ్లి వాళ్ల నాన్నను కాకా పట్టడం’ అనే సందేశాన్ని కూడా జత చేశారు.
నమ్రత షేర్ చేసిన ఫోటోలో సితార, గౌతమ్‌లు మహేష్‌బాబుతో ఏదో విషయం గురించి సీరియస్‌గా చర్చిస్తోన్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో తీసిన ఈ ఫోటోలో మహేష్ తన కుటుంబంతో కలిసి మళ్లీ ఎక్కడికో విహారానికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే వారు ఎక్కడికి వెళ్తున్నారు.. ఇంతకు సితారా, గౌతమ్ ఏ విషయం గురించి వాళ్ల నాన్నతో చర్చిస్తున్నారనే విషయాల గురించి మాత్రం ఎటువంటి సమాచారం లేదు. అలానే మహేష్ బాబు, ఆయన పిల్లలకు మధ్య డీల్ కుదిరిందా లేదా అనే విషయం గురించి కూడా తెలియలేదు.
ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ నటిస్తోన్న 25వ చిత్రం మహర్షి. 2019 సమ్మర్‌లో ఈ సినిమా విడుదల కానున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment