
మహేశ్‌బాబు సినిమాల్లో ఉన్న స్పెషల్ సాంగ్స్ సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండటమే కాదు ఫుల్ ఫేమస్ కూడా. ఆయన హీరోగా నటించిన ‘పోకిరి’ సినిమాలో ‘ఇప్పటికింకా నా వయసు...’, ‘దూకుడు’ సినిమాలో ‘ఆటో అప్పారావు...’, ‘వన్: నేనొక్కడినే’ చిత్రంలో ‘లండన్ బాబులు’, ‘ఆగడు’లో ‘జంక్షన్‌లో..’ పాటలే అందుకు ఉదాహరణ. తాజాగా మహేశ్ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారట చిత్రబృందం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా అశ్వనీదత్, ‘దిల్’ రాజు ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
‘అల్లరి’ నరేశ్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం డెహ్రాడూన్‌లో జరుగుతోంది. కాలేజీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఓన్లీ కాలేజ్‌లోనే మహేశ్ గడ్డం లుక్‌లో కనిపిస్తారట. ఆఫ్టర్ కాలేజీ సీన్స్ రెగ్యులర్ లుక్‌లోనే మహేశ్ కనిపిస్తారని టాక్. ఈ సినిమా సెకండాఫ్‌లోనే ఐటమ్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారట చిత్రబృందం. ఆల్రెడీ దేవిశ్రీ ప్రసాద్ ఐటమ్‌సాంగ్ ట్రాక్‌ను ఫైనలైజ్ చేశారని టాక్.
ఇందుకోసం టాప్ కథానాయికల లిస్ట్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం. మరి.. ఈ స్పెషల్ సాంగ్ చేయబోయే స్పెషల్ గాళ్ ఎవరో తెలుసుకోవాలంటే మాత్రం కాస్త టైమ్ పడుతుంది. అంతేకాక ‘ఆగడు’ సినిమా తర్వాత మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, స్పైడర్, భరత్ అనే నేను’ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లేవు. మళ్లీ ఇప్పుడు ఆల్మోస్ట్ నాలుగేళ్ల తర్వాత స్పెషల్ సాంగ్ అనగానే అది ఎలా ఉంటుందా? అన్న ఆసక్తి ఇప్పటి నుంచే ఫ్యాన్స్‌లో మొదలైంది. ఈ సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment