సంచలన విషయం చెప్పిన కొరటాల | koratala shiva reveals story line of mahesh cinema | Sakshi
Sakshi News home page

సంచలన విషయం చెప్పిన కొరటాల

Published Thu, Jan 25 2018 8:35 PM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

మహేష్‌బాబుతో తాజాగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ చేస్తున్న చిత్రానికి సంబంధించి సంచలన విషయం చెప్పారు. దాదాపు సినిమా కథను ఆయన ముందే ప్రకటించారు. మహేష్‌ ముఖ్యమంత్రిగా నటిస్తూ పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా వస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాకు కథగా అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌నే తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై కథను అల్లుకొని, రాజకీయ అంశాలతో చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌ ఓత్‌ అనే పేరిట శుక్రవారం ఉదయం 7గంటలకు (రిపబ్లిక్‌ డే) సందర్భంగా వీడియోకు బదులు ఓ ఆడియోను విడుదల చేస్తున్నట్లు కూడా చెప్పారు. వీడియోగా కాకుండా ఆడియోగా విడుదల చేస్తే ఇంపాక్ట్‌ ఉంటుందనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement