దిల్‌ ఖుష్‌... ఫుల్‌ జోష్‌ | Mahesh Babu and Trivikram join forces after 11 years | Sakshi
Sakshi News home page

దిల్‌ ఖుష్‌... ఫుల్‌ జోష్‌

Published Sun, May 2 2021 5:41 AM | Last Updated on Sun, May 2 2021 5:41 AM

Mahesh Babu and Trivikram join forces after 11 years - Sakshi

‘అతడు’ (2005), ‘ఖలేజా’ (2010) చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో చిత్రం రూపొందనుంది. ఈ చిత్రాన్ని శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్నారు. శనివారం ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత మహేశ్, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ సెట్‌ అయింది. దీంతో మహేశ్‌ ఫ్యాన్స్‌ దిల్‌ ఖుష్‌తో... ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. సూపర్‌స్టార్‌ కృష్ణ, మహేశ్‌బాబు తండ్రి బర్త్‌ డే (మే 31) సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement