Trivikram Direction
-
Trivikram: అప్పట్లో నాకు ముప్పై రూపాయలు మాత్రమే వుండే
-
భారీ బడ్జెట్ తో హాలీవుడ్ స్థాయిలో బన్నీ త్రివిక్రమ్ మూవీ
-
తారక్ కథతో వస్తున్న బన్నీ.. మైథాలజీ మూవీతో మాంత్రికుడు...
-
త్రివిక్రమ్ న్యూ మూవీ షురూ.. తెలుగు హీరో కాదంట!
-
గుంటూరు కారం సెట్స్‌లోకి మహేశ్‌బాబు
‘గుంటూరు కారం’ సెట్స్‌లోకి అడుగుపెట్టారు హీరో మహేశ్‌బాబు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీలీల ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇంకో హీరోయిన్ ఎంపిక కావాల్సి ఉంది. కాగా వివిధ కారణాల వల్ల ఏప్రిల్ తర్వాత ‘గుంటూరు కారం’ సినిమా మరో షెడ్యూల్ చిత్రీకరణ జరగలేదు. శనివారం ‘గుంటూరు కారం’ తాజా షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్‌లో ్ర΄ారంభమైంది. హైదరాబాద్ శివార్లలో వేసిన ఓ భారీ ఇంటి సెట్లో మహేశ్‌బాబు ΄ాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ నెలరోజులకు పైగానే సాగుతుందట. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 13న విడుదల కానుంది. -
ఆ రోజు SSMB 28 టీజర్ రిలీజ్
-
త్రివిక్రమ్ తో మహేష్ సినిమాపై బయపడుతున్న ఫ్యాన్స్
-
త్రివిక్రమ్ కి ఏమైంది ..?
-
Mahesh Babu: వర్కౌట్స్ స్టార్ట్ చేసిన మహేశ్‌బాబు.. ఆ సినిమా కోసమే..
జిమ్‌లో వర్కౌట్ షురూ చేశారు మహేశ్‌బాబు. సో.. త్వరలోనే ఆయన సెట్స్‌లోకి కూడా అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మలి షెడ్యూల్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ చిత్రీకరణ కోసమే మహేశ్‌బాబు వర్కౌట్స్ స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ఈ నెల చివర్లో లేదా వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇక ఈ సినిమా కాకుండా మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. -
త్రివిక్రమ్-మహేశ్‌బాబు సినిమా షూటింగ్ అప్పుడే..
‘అతడు’ (2005), ‘ఖలేజా’(2010) చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల రెండోవారం నుంచి ప్రారంభం కానుందనే టాక్ వినిపిస్తోంది. తొలుత ఓ యాక్షన్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేశారట చిత్రబృందం. ‘మహర్షి’ చిత్రం తర్వాత మహేశ్‌బాబు, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న సినిమా ఇది. చినబాబు (ఎస్.రాధాకృష్ణ) నిర్మిస్తున్న ఈ మూవీ 2023 ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. -
ఇంట్రెస్టింగ్.. 33 ఏళ్ల తర్వాత మహేశ్ బాబుతో మోహన్ బాబు !
Mohan Babu In Trivikram Mahesh Babu Movie: సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేశ్ సినిమా ఉండనుంది. మహేశ్-త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే అభిమానులే కాదు, పేక్షకులు కూడా ఎదురుచూస్తు ఉంటారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన 'అతడు' ఎంతపెద్ద హిట్ సొంతం చేసుకుందో తెలిసిందే. తర్వాత వచ్చిన 'ఖలేజా' కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ రెండు సినిమాల తర్వాత వీరి కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి మూవీ రానుందంటే ఆడియెన్స్‌లో కచ్చితంగా అంచనాలు భారీగానే ఉంటాయి. అందుకు తగినట్లుగానే సినిమా క్యాస్టింగ్‌ను త్రివిక్రమ్ ఎంచుకుంటున్నట్లు తెలిసింది. ఇటీవల ఈ సినిమాలో మహేశ్ బాబుకు చెల్లెలి పాత్రలో స్టార్ హీరోయిన్ సాయి పల్లవిని తీసుకోనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఈ చిత్రంలో విలక్షణ నటుడు మోహన్ బాబు నటించనున్నారని సమాచారం. మహేశ్ బాబుకు మామయ్యగా మోహన్ బాబు యాక్ట్ చేయనున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ పాత్రను తివిక్రమ్ చాలా వైవిధ్యంగా రూపొందించారని టాక్. ఇదిలా ఉంటే 1989లో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ఆయన డైరెక్షన్లోనే తెరకెక్కిన సినిమా 'కొడుకు దిద్దిన కాపురం'లో మోహన్ బాబు విలన్‌గా నటించారు. ఈ సినిమాలో మహేశ్ బాబు బాలనటుడిగా ద్విపాత్రాభినయం చేశాడు. మళ్లీ 33 సంవత్సరాల తర్వాత మరోసారి మోహన్ బాబు, మహేశ్ బాబు కలిసి నటించనుండడం విశేషం. మరీ ఈ వార్తల్లో ఎంతవరకూ నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే. -
దిల్ ఖుష్... ఫుల్ జోష్
‘అతడు’ (2005), ‘ఖలేజా’ (2010) చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ముచ్చటగా మూడో చిత్రం రూపొందనుంది. ఈ చిత్రాన్ని శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్నారు. శనివారం ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అయింది. దీంతో మహేశ్ ఫ్యాన్స్ దిల్ ఖుష్‌తో... ఫుల్ జోష్‌లో ఉన్నారు. సూపర్‌స్టార్ కృష్ణ, మహేశ్‌బాబు తండ్రి బర్త్ డే (మే 31) సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. -
ఫిబ్రవరిలో మొదలు
న్యూ ఇయర్‌కు ఒక్కరోజు ముందు తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు అల్లు అర్జున్. ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారు. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తారు. ఈ సినిమాలో హీరోయిన్గా పలువురు అగ్ర కథానాయికల పేర్లను పరిశీలిస్తున్నారట టీమ్. ఆ లిస్ట్‌లో ప్రముఖంగా హీరోయిన్ కియారా అద్వానీ పేరు వినిపిస్తోంది. ఇక షూటింగ్‌ను వచ్చే నెల రెండో వారంలో స్టార్ట్ చేయడానికి టీమ్ సన్నాహాలు చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ తాజా సమాచారం. ‘జు లాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత అల్లు అర్జున్–త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయని చెప్పొచ్చు. -
క్యా కియారా?
నార్త్, సౌత్ అనే తేడా లేకుండా వరుస అవకాశాలను చేజిక్కించుకుంటూ టాప్ గేర్‌లో దూసుకెళ్తున్నారు కథానాయిక కియారా అద్వానీ. మహేశ్‌బాబు ‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు తెరపై మెరిసిన ఈ బ్యూటీ ప్రస్తుతం రామ్‌చరణ్ ‘వినయ విధేయ రామ’ (ప్రస్తుతం అనుకుంటున్న టైటిల్) చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందనున్న సినిమాలో కియారాను కథానాయికగా తీసుకోవాలని చిత్రబృందం ఆలోచిస్తున్నారని సమాచారం. ఒకవేళ కియారా కన్ఫార్మ్ అయితే టాలీవుడ్లో బిజీగా ఉన్న హీరోయిన్స్ జాబితాలో చేరిపోతారామె. ఈ సినిమా డిసెంబర్ 11న పూజా కార్యక్రమాలు జరుపుకుంటుందని, రెగ్యులర్ షూటింగ్ జనవరిలో ప్రారంభం అవుతుందని తెలిసింది. ఇంతకుముందు త్రివ్రికమ్–అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలు ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. అందుకే మూడో చిత్రంపై భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ సంగతి అలా ఉంచితే....‘2 స్టేట్స్’ ఫేమ్ అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ మూవీ ‘కళంక్’లో కియారా ఒక కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్సిం గ్’లో కథానాయిక చాన్స్ కియారానే వరించింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ఆమె నటించిన ‘లస్ట్‌స్టోరీస్’ బాగా ప్రాచుర్యం పొందింది. మరి.. క్యా కియారా? అల్లు అర్జున్‌తో జోడీ కుదిరిందా? అంటే వెయిట్ అండ్ సీ. -
స్టీవెన్ కంట్రోల్లో ఎన్టీఆర్!
ఎవరీ స్టీవెన్? అతని కంట్రోల్లోకి ఎన్టీఆర్ వెళ్లడమేంటి? అసలేం జరిగింది? అని గ్యాప్ లేకుండా ప్రశ్నలు వేసుకుని ప్రెజర్‌కి గురి కావొద్దు. ఎన్టీఆర్ మీకు (ప్రేక్షకులకు) ఇంతకుముందు కన్నా ఫిట్‌గా, స్లిమ్‌గా కనిపించాలంటే స్టీవెన్ కంట్రోల్లో ఉండాల్సిందే. తనంతట తానుగా ఇష్టంగా ఈ ఫిజికల్ ట్రైనర్ కంట్రోల్లోకి వెళ్లారు యంగ్ టైగర్. సినిమా అంటే అంత ప్యాషన్ మరి. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. దీనికోసం యూకె నుంచి ఫిజికల్ ట్రైనర్ స్టీవెన్ లాయిడ్‌ని హైదరాబాద్ రప్పించారు. నాన్‌స్టాప్‌గా రెండు నెలలు: ఇక్కడ నాన్‌స్టాప్‌గా ఎన్టీఆర్‌తో రెండు నెలలు పాటు ఫిజికల్ ట్రైనింగ్ చేయిస్తారట స్టీవెన్. జస్ట్ వర్కవుట్స్ మాత్రమే కాదు.. ఫుడ్ కూడా ఆయనే డిసైడ్ చేస్తారు. బ్రేక్‌ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకూ స్టీవెన్ ఏది వండితే అదే ఎన్టీఆర్ తింటారని విశ్వసనీయ వర్గాల సమాచారమ్. స్టీవెన్ నిర్ణయించే మెనూలో నోటికి రుచిగా ఉండేవి దాదాపు తక్కువేనట. అయినా ఎన్టీఆర్‌కి ఓకే. క్యారెక్టర్ కోసం ఏం చేయడానికైనా వెనకాడని హీరో కదా. ఇంకో విషయం ఏంటంటే.. దాదాపు 15 లక్షల రూపాయలు పెట్టి ఓ కొత్త ఎక్విప్మెంట్ కొన్నారట. ఎన్టీఆర్ పర్సనల్ జిమ్‌లో ఈ ఎక్విప్‌మెంట్‌తోనే కొత్త వర్కవుట్స్ చేస్తారట. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్, రణవీర్ సింగ్‌లకు స్టీవెన్ పర్సనల్ ట్రైనర్. ఈ హీరోలిద్దరి ఫిట్నెస్ సూపర్బ్. సో.. మనం కొత్త ఎన్టీఆర్‌ని చూడబోతున్నామన్న మాట. -
రెండక్షరాల ప్రేమకథ...!
ఆనంద్.... అనసూయలు తమ ప్రేమ ప్రయాణానికి ట్రైన్లోనే ‘అ..ఆ’లు దిద్దుకున్నారు. ప్రతి కథకు ఓ బిగినింగ్... ట్విస్ట్.. ఎండింగ్ కంపల్సరీ. వీరి లవ్‌స్టోరీకి బిగినింగ్ బాగానే ఉంది. కానీ అనుకోకుండా ట్విస్ట్ వచ్చింది. మరి.. ఈ ప్రేమకథకు ఎలాంటి ఎండింగ్ వచ్చిందో తెలియాలంటే వచ్చే నెల 2వ తేదీ వరకూ ఆగాల్సిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత , అనుపమా పరమేశ్వరన్ ముఖ్యతారలుగా హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మించిన చిత్రం ‘‘అందమైన ప్రేమకథ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి త్రివిక్రమ్ సంభాషణలు హైలైట్‌గా నిలుస్తాయి’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె మేయర్, సినిమాటోగ్రఫీ: నటరాజన్ సుబ్రమణియన్.