అల్లు అర్జున్
న్యూ ఇయర్‌కు ఒక్కరోజు ముందు తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు అల్లు అర్జున్. ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారు. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పలువురు అగ్ర కథానాయికల పేర్లను పరిశీలిస్తున్నారట టీమ్. ఆ లిస్ట్‌లో ప్రముఖంగా హీరోయిన్ కియారా అద్వానీ పేరు వినిపిస్తోంది. ఇక షూటింగ్‌ను వచ్చే నెల రెండో వారంలో స్టార్ట్ చేయడానికి టీమ్ సన్నాహాలు చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ తాజా సమాచారం. ‘జు లాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత అల్లు అర్జున్–త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయని చెప్పొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment