స్టీవెన్‌ కంట్రోల్‌లో ఎన్టీఆర్‌! | Jr NTR may undergo special physical makeover for his next film with Trivikram | Sakshi
Sakshi News home page

స్టీవెన్‌ కంట్రోల్‌లో ఎన్టీఆర్‌!

Published Wed, Jan 3 2018 12:13 AM | Last Updated on Wed, Jan 3 2018 12:13 AM

Jr NTR may undergo special physical makeover for his next film with Trivikram - Sakshi

స్టీవెన్‌తో ఎన్టీఆర్‌

ఎవరీ స్టీవెన్‌? అతని కంట్రోల్‌లోకి ఎన్టీఆర్‌ వెళ్లడమేంటి? అసలేం జరిగింది? అని గ్యాప్‌ లేకుండా ప్రశ్నలు వేసుకుని ప్రెజర్‌కి గురి కావొద్దు. ఎన్టీఆర్‌ మీకు (ప్రేక్షకులకు) ఇంతకుముందు కన్నా ఫిట్‌గా, స్లిమ్‌గా కనిపించాలంటే స్టీవెన్‌ కంట్రోల్‌లో ఉండాల్సిందే. తనంతట తానుగా ఇష్టంగా ఈ ఫిజికల్‌ ట్రైనర్‌ కంట్రోల్‌లోకి వెళ్లారు యంగ్‌ టైగర్‌. సినిమా అంటే అంత ప్యాషన్‌ మరి. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్‌ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. దీనికోసం యూకె నుంచి ఫిజికల్‌ ట్రైనర్‌ స్టీవెన్‌ లాయిడ్‌ని హైదరాబాద్‌ రప్పించారు.

నాన్‌స్టాప్‌గా రెండు నెలలు:
ఇక్కడ నాన్‌స్టాప్‌గా ఎన్టీఆర్‌తో రెండు నెలలు పాటు ఫిజికల్‌ ట్రైనింగ్‌ చేయిస్తారట స్టీవెన్‌.  జస్ట్‌ వర్కవుట్స్‌ మాత్రమే కాదు.. ఫుడ్‌ కూడా ఆయనే డిసైడ్‌ చేస్తారు. బ్రేక్‌ఫాస్ట్‌ నుంచి డిన్నర్‌ వరకూ స్టీవెన్‌ ఏది వండితే అదే ఎన్టీఆర్‌ తింటారని విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. స్టీవెన్‌ నిర్ణయించే మెనూలో నోటికి రుచిగా ఉండేవి దాదాపు తక్కువేనట. అయినా ఎన్టీఆర్‌కి ఓకే. క్యారెక్టర్‌ కోసం ఏం చేయడానికైనా వెనకాడని హీరో కదా. ఇంకో విషయం ఏంటంటే.. దాదాపు 15 లక్షల రూపాయలు పెట్టి ఓ కొత్త ఎక్విప్‌మెంట్‌ కొన్నారట. ఎన్టీఆర్‌ పర్సనల్‌ జిమ్‌లో ఈ ఎక్విప్‌మెంట్‌తోనే కొత్త వర్కవుట్స్‌ చేస్తారట. ఇదిలా ఉంటే.. బాలీవుడ్‌ హీరోలు హృతిక్‌ రోషన్,  రణవీర్‌ సింగ్‌లకు స్టీవెన్‌ పర్సనల్‌ ట్రైనర్‌. ఈ హీరోలిద్దరి ఫిట్‌నెస్‌ సూపర్బ్‌. సో.. మనం కొత్త ఎన్టీఆర్‌ని చూడబోతున్నామన్న మాట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement