Steven
-
సీగల్‌కు రష్యా ఫ్రెండ్షిప్ అవార్డు
మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధా న్ని సమర్థించిన హాలీవుడ్ యాక్షన్ స్టార్ స్టీవె న్ సీగల్ (70)కు రష్యా ‘ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్షిప్’ అవార్డు ప్రకటించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సీగల్ గట్టి మద్దతుదారు. 2014లో క్రిమియా ఆక్రమణను కూడా సమర్థించారు. 2016లో ఆయనకు రష్యా తమ దేశ పౌరసత్వం కూడా ఇచ్చింది. అంతేగాక పుతిన్ వ్యక్తిగతంగా సీగల్‌కు రష్యా పాస్‌పోర్టు అందజేశారు! 2018 నుంచీ అమెరికా, జపాన్ దేశాల్లో రష్యా విదేశాంగ శాఖ ప్రత్యేక రాయబారిగా కూడా సీగల్ పని చేస్తున్నారు. అమెరికా మాజీ విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్, ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో తదితరులకు కూడా ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అవార్డు ప్రకటించారు. -
స్టీవెన్ కంట్రోల్లో ఎన్టీఆర్!
ఎవరీ స్టీవెన్? అతని కంట్రోల్లోకి ఎన్టీఆర్ వెళ్లడమేంటి? అసలేం జరిగింది? అని గ్యాప్ లేకుండా ప్రశ్నలు వేసుకుని ప్రెజర్‌కి గురి కావొద్దు. ఎన్టీఆర్ మీకు (ప్రేక్షకులకు) ఇంతకుముందు కన్నా ఫిట్‌గా, స్లిమ్‌గా కనిపించాలంటే స్టీవెన్ కంట్రోల్లో ఉండాల్సిందే. తనంతట తానుగా ఇష్టంగా ఈ ఫిజికల్ ట్రైనర్ కంట్రోల్లోకి వెళ్లారు యంగ్ టైగర్. సినిమా అంటే అంత ప్యాషన్ మరి. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. దీనికోసం యూకె నుంచి ఫిజికల్ ట్రైనర్ స్టీవెన్ లాయిడ్‌ని హైదరాబాద్ రప్పించారు. నాన్‌స్టాప్‌గా రెండు నెలలు: ఇక్కడ నాన్‌స్టాప్‌గా ఎన్టీఆర్‌తో రెండు నెలలు పాటు ఫిజికల్ ట్రైనింగ్ చేయిస్తారట స్టీవెన్. జస్ట్ వర్కవుట్స్ మాత్రమే కాదు.. ఫుడ్ కూడా ఆయనే డిసైడ్ చేస్తారు. బ్రేక్‌ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకూ స్టీవెన్ ఏది వండితే అదే ఎన్టీఆర్ తింటారని విశ్వసనీయ వర్గాల సమాచారమ్. స్టీవెన్ నిర్ణయించే మెనూలో నోటికి రుచిగా ఉండేవి దాదాపు తక్కువేనట. అయినా ఎన్టీఆర్‌కి ఓకే. క్యారెక్టర్ కోసం ఏం చేయడానికైనా వెనకాడని హీరో కదా. ఇంకో విషయం ఏంటంటే.. దాదాపు 15 లక్షల రూపాయలు పెట్టి ఓ కొత్త ఎక్విప్మెంట్ కొన్నారట. ఎన్టీఆర్ పర్సనల్ జిమ్‌లో ఈ ఎక్విప్‌మెంట్‌తోనే కొత్త వర్కవుట్స్ చేస్తారట. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్, రణవీర్ సింగ్‌లకు స్టీవెన్ పర్సనల్ ట్రైనర్. ఈ హీరోలిద్దరి ఫిట్నెస్ సూపర్బ్. సో.. మనం కొత్త ఎన్టీఆర్‌ని చూడబోతున్నామన్న మాట. -
ఔత్సాహికుల కోసం సినిమా వర్క్‌షాప్
సాక్షి,సిటీబ్యూరో: తెలుగు సినీ రంగంలోని వివిధ సాంకేతిక శాఖల్లో ప్రవేశించాలని కోరుకునే ఔత్సాహికుల కోసం ‘ఏ 2 జెడ్ సినిమా వర్క్‌షాప్’ పేరిట రెండు రోజుల వర్క్‌షాప్ శనివారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. దర్శకుడు వీరశంకర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వర్క్‌షాప్‌లో ‘సినిమా కథలు ఎలా దొరుకుతాయి’ (విశ్లేషణ: రచయిత కె.ఎల్.ప్రసాద్), ‘కథనం- విజయవంతమైన చిత్రాల్లో రస పోషణ‘ (పరిశోధకులు డాక్టర్ గౌతమ్ కాశ్యప్), ‘ప్రపంచ సినిమా’ (విమర్శకుడు మామిడి హరికృష్ణ), ‘దర్శకత్వం’ (ఇంద్రగంటి మోహనకృష్ణ), ‘కళా దర్శకత్వం’ (ఆర్ట్ డెరైక్టర్ అశోక్) తదితర అంశాలపై సోదాహరణంగా ప్రసంగించారు. చెన్నై, బెంగుళూరు, నెల్లూరుతో పాటు వివిధ ప్రాంతాల నుంచి 113 మంది ఔత్సాహికులు ఇందులో పాల్గొన్నారు. ప్రముఖ సినీ దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్, త్రిపురనేని ప్రసాద్, శివనాగేశ్వరరావు, విజయభాస్కర్, రామ్‌ప్రసాద్, దేవీ ప్రసాద్, ‘హృదయ కాలేయం’ ఫేమ్ స్టీవెన్ శంకర్, ఫైట్ మాస్టర్ సతీష్ తదితరులు ఈ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు దాదాపు గంట పైగా కూర్చొని, హిట్ చిత్రాల రూపకల్పనకు సంబంధించి నిపుణుల విశ్లేషణ వినడం విశేషం. ఆదివారం ‘డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం, పబ్లిసిటీ, సినిమా కలెక్షన్లు’ అంశాలపై సదస్సు జరగనుందని నిర్వాహకులు తెలిపారు.