కియారా అద్వానీ, అల్లు అర్జున్
నార్త్, సౌత్ అనే తేడా లేకుండా వరుస అవకాశాలను చేజిక్కించుకుంటూ టాప్ గేర్‌లో దూసుకెళ్తున్నారు కథానాయిక కియారా అద్వానీ. మహేశ్‌బాబు ‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు తెరపై మెరిసిన ఈ బ్యూటీ ప్రస్తుతం రామ్‌చరణ్ ‘వినయ విధేయ రామ’ (ప్రస్తుతం అనుకుంటున్న టైటిల్) చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందనున్న సినిమాలో కియారాను కథానాయికగా తీసుకోవాలని చిత్రబృందం ఆలోచిస్తున్నారని సమాచారం. ఒకవేళ కియారా కన్ఫార్మ్ అయితే టాలీవుడ్‌లో బిజీగా ఉన్న హీరోయిన్స్ జాబితాలో చేరిపోతారామె.
ఈ సినిమా డిసెంబర్ 11న పూజా కార్యక్రమాలు జరుపుకుంటుందని, రెగ్యులర్ షూటింగ్ జనవరిలో ప్రారంభం అవుతుందని తెలిసింది. ఇంతకుముందు త్రివ్రికమ్–అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలు ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. అందుకే మూడో చిత్రంపై భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ సంగతి అలా ఉంచితే....‘2 స్టేట్స్’ ఫేమ్ అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ మూవీ ‘కళంక్’లో కియారా ఒక కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్‌సిం గ్’లో కథానాయిక చాన్స్ కియారానే వరించింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ఆమె నటించిన ‘లస్ట్‌స్టోరీస్’ బాగా ప్రాచుర్యం పొందింది. మరి.. క్యా కియారా? అల్లు అర్జున్‌తో జోడీ కుదిరిందా? అంటే వెయిట్ అండ్ సీ.
Comments
Please login to add a commentAdd a comment