అల్లు అర్జున్
సినిమాలోని తన పాత్ర కోసం అల్లు అర్జున్ ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటారు. ఎంతైనా కష్టపడతారు. ‘దేశముదురు’ సినిమాకోసం సిక్స్ ప్యాక్ చేశారు. ‘బద్రినాథ్’ సినిమాలో దేవాలయ సంరక్షుడి పాత్రలోకి మారిపోయారు. ‘దువ్వాడ జగన్నాథమ్’ సినిమాలో బ్రాహ్మణునిగా చక్కని సంభాషణలు పలికారు. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలో సైనికుడి పాత్రలో ఒదిగిపోయారు. ఇప్పుడు తన నెక్ట్స్ చిత్రంలోని పాత్రకోసం బరువు తగ్గే పనిలో పడ్డారట అల్లు అర్జున్. ఇందుకోసం ఆయన ఓ స్పెషల్ డైట్‌ను కూడా ఫాలో అవుతున్నారని వినికిడి.
అందుకు తగ్గట్లే కసరత్తులు కూడా చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారు. ఎస్.రాధాకృష్ణ, అల్లు అరవింద్ నిర్మిస్తారు. ఈ నెలలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం పలువురు కథానాయికల పేర్లను పరిశీలిస్తున్నారట. ముఖ్యంగా కియారా అద్వానీ, రష్మికా మండన్నా పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలో అధికారిక ప్రకటన రావొచ్చు. ఇంతకుముందు అల్లు అర్జున్–త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలు హిట్ సాధించడంతో తాజా సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment