అల్లు అర్జున్
సినిమాలను ఫైనలైజ్ చేయడమే కాదు... ఆ సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్లడంలోనూ అంతే పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్‌పైన ఉండగానే సుకుమార్ దర్శకత్వంలో నటించనున్న సినిమాను కూడా సెట్స్‌పైకి తీసుకెళ్తున్నారు అల్లు అర్జున్. ‘ఆర్య (2004), ఆర్య 2(2010)’ చిత్రాల తర్వాత సుకుమార్–అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రానున్న మూడో చిత్రం ఇది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు.
ఈ సినిమా పూజా కార్యక్రమం ఈ నెల 11న జరగనుందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తారు. ఇందులో రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలిసింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను జూన్‌లో ప్రారంభించాలనుకుంటున్నారు. సో.. అటు త్రివిక్రమ్ ఇటు సుకుమార్ సినిమాలు చేస్తూ బన్నీ ఫుల్ బిజీగా ఉంటారన్న మాట. ఇవి కాకుండా ‘ఓ మైఫ్రెండ్, ఏమ్‌సీఏ’ వంటి చిత్రాలను తెరకెక్కించిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ‘ఐకాన్: కనపడుటలేదు’ అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment