Mahesh Babu: వర్కౌట్స్‌ స్టార్ట్‌ చేసిన మహేశ్‌బాబు.. ఆ సినిమా కోసమే.. | Mahesh Babu gym Worlout pic is trending | Sakshi
Sakshi News home page

Mahesh Babu: వర్కౌట్స్‌ స్టార్ట్‌ చేసిన మహేశ్‌బాబు.. ఆ సినిమా కోసమే..

Published Fri, Nov 11 2022 12:33 AM | Last Updated on Fri, Nov 11 2022 2:23 PM

Mahesh Babu gym Worlout pic is trending - Sakshi

జిమ్‌లో వర్కౌట్‌ షురూ చేశారు మహేశ్‌బాబు. సో.. త్వరలోనే ఆయన సెట్స్‌లోకి కూడా అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా మలి షెడ్యూల్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌ చిత్రీకరణ కోసమే మహేశ్‌బాబు వర్కౌట్స్‌ స్టార్ట్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

కాగా ఈ సినిమా షూటింగ్‌ షెడ్యూల్‌ ఈ నెల చివర్లో లేదా వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్‌. ఇక ఈ సినిమా కాకుండా మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement