రెండక్షరాల ప్రేమకథ...!
ఆనంద్.... అనసూయలు తమ ప్రేమ ప్రయాణానికి ట్రైన్‌లోనే ‘అ..ఆ’లు దిద్దుకున్నారు. ప్రతి కథకు ఓ బిగినింగ్... ట్విస్ట్.. ఎండింగ్ కంపల్సరీ. వీరి లవ్‌స్టోరీకి బిగినింగ్ బాగానే ఉంది. కానీ అనుకోకుండా ట్విస్ట్ వచ్చింది. మరి.. ఈ ప్రేమకథకు ఎలాంటి ఎండింగ్ వచ్చిందో తెలియాలంటే వచ్చే నెల 2వ తేదీ వరకూ ఆగాల్సిందే.
త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత , అనుపమా పరమేశ్వరన్ ముఖ్యతారలుగా హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మించిన చిత్రం ‘‘అందమైన ప్రేమకథ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి త్రివిక్రమ్ సంభాషణలు హైలైట్‌గా నిలుస్తాయి’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె మేయర్, సినిమాటోగ్రఫీ: నటరాజన్ సుబ్రమణియన్.