
ఒక్కొక్కరుగా టీమ్‌లో యాడ్ అవుతున్నారు. ఎవరి టీమ్‌లో అంటే.. మహేశ్‌బాబు టీమ్‌లో. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్ పతాకాలపై ‘దిల్’ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్, లొకేషన్స్ హంట్ కంప్లీట్ చేసిన చిత్రబృందం ఇప్పుడు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రీసెంట్‌గా కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసిన చిత్రబృందం, ఇప్పుడు లేటెస్ట్‌గా బాలీవుడ్ కెమెరామేన్ కేయు మోహనన్‌ను టీమ్‌లోకి తీసుకున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేసింది. ‘డాన్, తలాష్, రాయీస్’ వంటి హిందీ చిత్రాలకు కెమెరామేన్‌గా వర్క్ చేశారు మోహనన్. తెలుగు సినిమాకి ఆయన వర్క్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను ఏప్రిల్‌లో స్టార్ట్ చేయనున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment