
అవునా... కోట ఎక్కడ ఉందేంటి? హైదరాబాద్‌లో! నిజమా... పేరేంటో? చిరాన్ ఫోర్ట్! ఊరుకోండి... ఈ రోజుల్లో రాజులు, కోటలు ఎక్కడున్నాయ్? అనుకుంటున్నారా! ఇప్పుడు మన దేశంలో రాజులు లేరు గానీ, వారసత్వ సంపదగా కోటలను మాత్రం మనకు వదిలారు... వాళ్ల పరిపాలనకు గుర్తుగా! అలాంటి కోటల్లో చిరాన్ ఫోర్ట్ ఒకటి. ఇప్పుడీ కోటలో మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా చిత్రీకరిణ జరిగింది.
జూన్‌లో ఓసారి, ఇప్పుడోసారి (గత వారంలో) మూడేసి రోజులు మహేశ్, ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. రాజకీయ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సిన్మాలో మహేశ్ ముఖ్యమంత్రిగా నటిస్తున్నారు. మహేశ్‌కి జోడీగా బీటౌన్ బేబీ కియారా అద్వానీ నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్ 27న విడుదల కానున్న ఈ చిత్రానికి ‘భరత్ అనే నేను’ టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి స్వరకర్త.
Comments
Please login to add a commentAdd a comment