
ప్యారిస్ లో ప్రిన్స్
హైదరాబాద్ : అటు సినిమాలు, ఇటు యాడ్స్ అంటూ బిజీబిజీగా గడిపే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రస్తుతం తన భార్యాబిడ్డలతో ప్యారిస్ పర్యటనలో హ్యాపీగా ఉన్నాడు. కేవలం కెరీర్ కాకుండా కుటుంబం కూడా తనకు చాలా ముఖ్యమని ఎపుడూ చెప్పే ఈ టాలీవుడ్ ప్రిన్స్ పిల్లా పాపలతో దసరా సెలవులను ప్యారిస్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ట్రిప్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఫొటోలను మహేష్ భార్య, నటి నమ్రతా శిరోద్కర్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో పోస్ట్ చేశారు.
సూపర్ స్టార్ తన పిల్లలతో ఎంజాయ్ చేస్తూ సమయం గడుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. గౌతమ్ కృష్ణ, సితార కూడా ఎంతో క్యూట్ గా ఈ టూర్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ ఫొటోలు ఇపుడు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. నవ్వుతూ.. తుళ్లుతూ.. మహేష్ బాబు తన పిల్లలు ఇద్దరిని దగ్గరకు హత్తుకుని మురిసిపోతున్న వైనం ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది.
వరుస విజయాలతో మహేష్ బాబు ఈ మధ్య కాలంలో తన జోరు పెంచారు. శ్రీమంతుడు సినిమా సాధించిన ఘనవిజయంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కొన్ని గ్రామాలను దత్తతకు తీసుకుని అభిమానులను, ప్రజలను మరింత చేరువయ్యాడు. కెరియర్ లో ఎపుడూ తలమునకలై ఉండే ఈ హీరో ఇఫ్పుడు బ్రహ్మోత్సవం చిత్ర నిర్మాణంలో కొంత గ్యాప్ తీసుకొని ఫ్యామిలీతో ప్యారిస్ ట్రిప్ చెక్కేశాడు.