రంగు పడుద్ది! | Mahesh Babu To Bring A Surprise To Fans | Sakshi
Sakshi News home page

రంగు పడుద్ది!

Nov 13 2017 1:54 AM | Updated on May 10 2018 12:13 PM

Mahesh Babu To Bring A Surprise To Fans - Sakshi

అవును... రంగుల పండుగ ముసుగులో భరత్‌ మీద ఎటాక్‌ చేయాలనుకున్న రౌడీలందరి నోటి నుంచి రంగు పడుతుందట! హోలీ సందడిలో సంతోషంగా ఉన్న సామాన్యులకు ఇబ్బంది లేకుండా... సీయం భరత్‌ రౌడీల బెండు తీస్తాడట! కొరటాల శివ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమాలో మహేశ్‌బాబు ముఖ్యమంత్రి భరత్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా కోసం హోలీ నేపథ్యంలో ఓ ఫైట్‌ తీశారని ‘సాక్షి’ పాఠకులకు తెలియజేసింది.

మహేశ్, కొరటాల కలయికలో వచ్చిన ‘శ్రీమంతుడు’లో మామిడి తోట ఫైట్‌ ఎంత హైలైట్‌ అయ్యిందో... అంతకు మించి ఈ హోలీ ఫైట్‌ హైలైట్‌ అవుతుందని సినిమా యూనిట్‌ సన్నిహిత వర్గాల సమాచారమ్‌. హీరోయిజమ్‌ అండ్‌ స్టైల్‌ ఏమాత్రం తగ్గకుండా ఈ ఫైట్‌ను డిజైన్‌ చేశారట! స్క్రీన్‌ మీద విలన్స్‌ రంగు పడుతుంటే... థియేటర్లో స్క్రీన్‌ ముందు అభిమానులు ఎగరేసే రంగు రంగుల పేపర్లు పడతాయేమో! ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ షూట్‌ చేసిన తర్వాత ఫ్యామిలీతో కలసి మహేశ్‌ ఫారిన్‌ వెళ్లారు. ఈ నెల 20వ తేదీ తర్వాత తిరిగొస్తారని తెలుస్తోంది. 26 నుంచి పొల్లాచ్చిలో కొరటాల సినిమా కొత్త షెడ్యూల్‌ మొదలవుతుంది. బీటౌన్‌ బ్యూటీ కియారా అలీ అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ స్వరకర్త. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 27న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement