
మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇందులో విలన్ పాత్రకు ఇప్పటికే ఉపేంద్ర, సుదీప్ పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా యాక్టర్ అర్జున్ పేరు వినిపిస్తోంది. ఈ చిత్రంలోని ఓ ప్రధాన పాత్రకు అర్జున్‌ను చిత్రయూనిట్ సంప్రదించిందని, అది విలన్ పాత్రే అని ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్న లేటెస్ట్ టాక్. మరి.. ‘సర్కారువారి పాట’ చిత్రంలో విలన్‌గా అర్జున్ ఖరారవుతారా? వేచి చూడాల్సిందే.