‘‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిగారి అభిమానిని నేను. ఆయన్ని చూస్తే ఒక హీరో అనే అనుభూతి కలుగుతుంది. ఆయన వద్దకు ఏదైనా సమస్యని తీసుకెళితే ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ భరోసా ఇచ్చేవారు. ‘సర్కారువారి పాట’లో అలాంటి ఒక సందర్భంలో మహేశ్‌గారు ఆ డైలాగ్ చెబుతున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశారు’’ అని పరశురాం అన్నారు. మహేశ్‌బాబు, కీర్తీ సురేశ్ జంటగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న రిలీజవుతోంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు పరశురాం మీడియాతో పంచుకున్న విశేషాలు.
‘గీత గోవిందం’ నిర్మాణంలో ఉన్నప్పుడే ‘సర్కారువారి పాట’ ఐడియా వచ్చింది. ‘గీత గోవిందం’ హిట్ నాకు గొప్ప ఎనర్జీ ఇచ్చింది. పరశురాం అనే దర్శకుడు రూ. 150కోట్ల సినిమా తీయగలడనే నమ్మకాన్ని ఇండస్ట్రీకి ఇవ్వడం సంతోషంగా ఉంది. ఇక ‘గీత గోవిందం’ విడుదలయ్యాక మహేశ్‌గారిని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ వర్క్ చేశాను. ఈ చిత్రంలో బ్యాంక్ టాపిక్ ఉంటుంది కానీ మహేశ్‌గారు బ్యాంక్ ఉద్యోగి కాదు. ఈ సినిమాలో ఒక వ్యక్తి గురించి కానీ, వ్యవస్థని ప్రశ్నించడం కానీ ఉండవు.
నా కల తీరింది
మహేశ్‌గారితో సినిమా చేయాలనేది నా డ్రీమ్. ‘సర్కారువారి పాట’ ఆయన కోసం రాసిన కథ. దేవుడి దయ వల్ల ఆయనే చేయడంతో నా కల తీరింది. ఈ కథని
అల్లు అర్జున్‌గారికి చెప్పలేదు. ‘గీత గోవిందం’ లాంటి హిట్ ఉన్నప్పటికీ నాలాంటి ఒక మీడియమ్ రేంజ్ దర్శకుడికి మహేశ్‌గారు చాన్స్ ఎలా ఇచ్చారనే ప్రశ్న కొందరిలో ఉండొచ్చు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత అందరూ హ్యాపీగా ఫీలవుతారు. నేను చెప్పిన కథ నచ్చే మహేశ్‌గారు ‘సర్కారువారి పాట’కి పచ్చజెండా ఉపారు.‘పోకిరి’ ఒక అండర్ కాప్ బిహేవియర్. ‘సర్కారువారి పాట’ ఒక కామన్‌మేన్ బిహేవియర్. ఇందులో మహేశ్‌గారి మ్యానరిజమ్స్, లుక్స్, బాడీ లాంగ్వేజ్, డాన్స్‌లు చూసి ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ అవుతారు.
కీర్తి పాత్ర లవ్లీగా ఉంటుంది
ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకి కీర్తీ సురేష్ తప్ప మరో ఆలోచన రాలేదు. తనది బలమైన పాత్ర. లవ్లీగా, లైవ్లీగా ఉంటుంది. ఆమె పాత్రకు కూడా మంచి పేరొస్తుంది. సముద్ర ఖని పాత్ర అద్భుతంగా ఉంటుంది.
పూరీగారు అభినందించారు
మా గురువు పూరి జగన్నాథ్, త్రివిక్రమ్‌గార్ల సినిమాలన్నీ చూస్తాను. అందుకేనేమో డైలాగులు బాగా రాయగలుగుతున్నాను. ‘సర్కారువారి..’ ట్రైలర్ చూసి పూరీగారు అభినందించారు.
నెక్ట్స్ నాగచైతన్యతో...
‘పెన్నీ...’ సాంగ్ ప్రమోషన్‌లో సితార డాన్స్‌కి మంచి స్పందన వచ్చింది. ‘సర్కారువారి పాట’ని పాన్ ఇండియాగా చేయాలనే ఆలోచన నాకు కానీ, మహేశ్‌గారికి కానీ లేదు. ముందు అనుకున్నట్లే చేశాం. అన్ని చోట్లా తెలుగు వెర్షన్ రిలీజ్ అవుతుంది. నా తర్వాతి సినిమా నాగచైతన్య హీరోగా 14 రీల్స్ నిర్మాణంలో ఉంటుంది.
Sarkaru Vaari Paata: వైఎస్‌ఆర్‌గారిని చూస్తే హీరో ఫీలింగ్
Published Sat, May 7 2022 5:40 AM | Last Updated on Sat, May 7 2022 7:10 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment