శిల్పా మోహన్‌రెడ్డికి మహేష్ అభిమానుల మద్దతు
నంద్యాల: సూపర్ స్టార్ కృష్ణ, హీరో మహేష్‌బాబు అభిమానులతో సోమవారం వైఎస్‌ఆర్‌సీపీ నేత ఆదిశేషగిరిరావు భేటీ అయ్యారు. నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి మద్దతు తెలిపారు. తాము సోమవారం నుంచి వైఎస్‌ఆర్‌సీపీ తరఫున ప్రచారంలో పాల్గొంటారని అభిమాన సంఘం ప్రతినిధులు చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్‌ఆర్‌సీపీ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.