Adiseshagiri Rao
-
మా మీద చాలా కక్ష పెంచుకున్నారు ఎందుకంటే..!
-
చిరంజీవికి నాకు మంచి అనుబంధం..కానీ పవన్ కళ్యాణ్ తో..!
-
ప్రభాస్ చేసిన సినిమాకి నష్టపోయిన ప్రొడ్యూసర్లు
-
విజయనిర్మల గురించి ఎంత చెప్పినా తక్కువే: ఆదిశేషగిరిరావు
-
రామోజీ ఫిల్మ్ సిటీ చాలా నష్టాల్లో ఉంది... దాని వల్ల ఏ లాభం లేదు
-
చంద్రబాబు సిద్ధాంతం వల్ల టీడీపీ చాలా నష్టపోతుంది
-
మహేశ్‌బాబు గురించి ఫ్యాన్స్‌కు తెలియని సీక్రెట్స్ బయటపెట్టిన బాబాయ్
సూపర్‌స్టార్ మహేశ్ బాబు దూకుడు మీదున్నాడు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తున్న అతడు నెక్స్ట్ రాజమౌళితో ఓ మూవీ చేయనున్నాడు. ఈ గ్యాప్‌లో ఇటీవలే స్పెయిన్‌కు వెకేషన్‌కు వెళ్లొచ్చాడు. ఇదిలా ఉంటే మహేశ్ తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు మే 31న రీరిలీజ్ కాబోతోంది. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆది శేషగిరి రావు ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్యూలో ఆయన మహేశ్‌బాబు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'మహేశ్‌బాబు నమ్రతను ప్రేమిస్తున్న విషయాన్ని ముందుగా తన తల్లి ఇందిరతో చెప్పాడు. ఆమె వెళ్లి కృష్ణకు చెప్పింది. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు కాబట్టి పెళ్లి చేద్దాం అని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో నా పాత్ర ఏమీ లేదు. కాకపోతే నేను మహేశ్‌బాబుతో వంశీ అని ఒకే ఒక్క సినిమా తీశాను. అందులో నమ్రతను హీరోయిన్గా పెట్టి చేశానంతే! మహేశ్‌బాబు చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. అతడు మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. ఎవరినైనా ఇమిటేట్ చేస్తాడు. అతడు పెద్ద స్టార్ అవుతాడని నేను ముందే ఊహించాను. మహేశ్‌కు అమితాబ్ బచ్చన్‌కు ఉన్నంత టాలెంట్ ఉంది. 14 ఏళ్ల వయసులో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే కారు నడిపాడు. మద్రాస్‌లో పోలీసులు చూసి వెంటపడితే నేరుగా ఆఫీస్‌లోకి ఎంటరై ఏమీ తెలియనట్లు వచ్చి కూర్చున్నాడు. నేనే పోలీసులతో మాట్లాడి పంపించేశాను' అని ఆదిశేషగిరి రావు తెలిపాడు. చదవండి: ప్రేయసిని పెళ్లాడిన నటుడు, వైరల్‌గా మారిన ఫోటోలు -
నంది అవార్డులపై నిర్మాత అది శేషగిరావు కీలక వ్యాఖ్యలు
తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా భావించే నంది అవార్డులపై ప్రముఖ నిర్మాత ఆది శేషగిరిరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్నవాళ్లకే నంది అవార్డ్స్ ఇస్తున్నారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయాక నంది అవార్డులను ఎవరూ పట్టించుకోవట్లేదన్నారు. మే31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా మోసగాళ్లకు మోసగాడు సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత ఆది శేషగిరిరావు మాట్లాడుతూ.. రెండు ప్రభుత్వాలు ఫిల్మ్ ఇండస్ట్రీని పట్టించుకోవట్లేదని విమర్శించారు. ఒకప్పుడు ప్రభుత్వాలు ప్రకటించే అవార్డులకు చాలా ప్రాముఖ్యత ఉండేదని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. తన ఉద్దేశంలో నంది అవార్డులకు ప్రాముఖ్యత లేదని తెలిపారు. (చదవండి: చైతన్య మాస్టర్ ఆత్మహత్య.. శ్రద్దా దాస్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్ ) గతంలో కూడా పలువురు సినీ ప్రముఖులు నంది అవార్డుల ప్రకటనపై అసంతృప్తి వెల్లడించారు. చంద్రబాబు నాయుడు హయాంలో కులాలను బట్టే నంది అవార్డులను ప్రకటించేవారని ప్రముఖ నటుడు పొసాని కృష్ణమురళి ఆరోపించారు. ప్రతిభను ప్రామాణికంగా తీసుకోకుండా.. చంద్రబాబు భజనే కొలమానంగా తీసుకొని అవార్డుల పంపకాలు జరిగాయని విమర్శించారు. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, మహేశ్‌బాబు బాబాయ్ ఆది శేషగిరిరావు కూడా అలాంటి వ్యాఖ్యలే చేయడం హాట్ టాపిక్‌గా మారింది. -
ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉండేవారు
ప్రముఖ నటుడు కృష్ణంరాజు గత ఆదివారం (11న) కన్నుమూసిన విషయం తెలిసిందే. మంగళవారం హైదరాబాద్‌లో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు నిర్మాతల మండలి, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆయన సంతాప సభలో కృష్ణంరాజు కుమార్తె ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తి పాల్గొన్నారు. నిర్మాత జి. ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ– ‘‘కృష్ణంరాజుగారు, నేను, చంద్ర మోహన్ ఆర్నెల్ల పాటు చెన్నైలో ఒకే రూమ్‌లో ఉన్నాం. మా అన్నయ్య కృష్ణగారితో ఎంత స్వంతంత్రంగా ఉండేవాణ్ణో కృష్ణంరాజుగారితో కూడా అలాగే ఉండేవాణ్ణి. అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉండేవారు’’ అన్నారు. నటుడు మోహన్‌బాబు మాట్లాడుతూ– ‘‘కృష్ణంరాజుగారు లేని బాధ ఆయన కుటుంబానికే కాదు ఆయనతో సన్నిహితంగా ఉన్నవాళ్లకి కూడా ఉంటుంది. నన్ను తొలిసారి బెంజి కారులో ఎక్కించింది కృష్ణంరాజుగారు, ఆయన సోదరుడు సూర్యనారాయణ రాజు’’ అన్నారు. నిర్మాత రమేశ్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘చెన్నైలో ఉన్నప్పటి నుంచి నేను, కృష్ణంరాజు ఫ్రెండ్స్. మా తండ్రిగారికి (ఎల్వీ ప్రసాద్) కూడా కృష్ణంరాజు అంటే చాలా ఇష్టం’’ అన్నారు. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘నిజం చెప్పాలంటే ఇక్కడ మాట్లాడటానికి సిగ్గు పడే పరిస్థితుల్లో ఉన్నాను. మూడేళ్ల క్రితం ఆయన మూవీ టవర్స్‌కి వచ్చి మార్కెట్ ధరకు ఫ్లాట్ కొనుక్కుంటానని అడిగారు.. కారణాలేవైనా ఫ్లాట్ ఇవ్వలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను. ఇండస్ట్రీలో పెట్టే ఏ అసోసియేషన్స్ అయినా కూడా మన సభ్యుల మంచి కోసం పెడతాం.. కానీ వ్యాపారం చేయాలనుకుంటే అంతకంటే మనం సిగ్గుపడాల్సిన విషయం ఉండదు’’ అన్నారు. నటుడు బాబూమోహన్ మాట్లాడుతూ– ‘‘కృష్ణంరాజు అన్నగారి ‘పాపే నా ప్రాణం’తో ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. 24క్రాఫ్ట్స్‌లో ఆయన గురించి ఎవరూ చెడ్డగా మాట్లాడలేదు’’ అన్నారు. ‘తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్’ అధ్యక్షుడు బసిరెడ్డి, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు, ‘డైరెక్టర్స్ అసోసియేషన్’ ప్రెసిడెంట్ కాశీ విశ్వనాథ్, నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, సి.కల్యాణ్, నటి జీవితతో పాటు పలువురు దర్శక–నిర్మాతలు, నటీనటులు, టీఎఫ్జేఏ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
తెలుగు ఫిలిం చాంబర్‌పై నిర్మాత సంచలన వ్యాఖ్యలు
పైరసీని అరికట్టడంలో ఫిలిం చాంబర్ విఫలమైందని నిర్మాత ఆదిశేషగిరిరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందన్నారు. అలాగే ఫిల్మ్ పైరసీని అరికట్టడంలో ఫిలించాంబర్ విఫలమైందని, సినిమాలు విడుదలైన మరుసటి రోజే ఆన్లైన్లో, యూట్యూబ్‌లో వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓటీటీ, అందులో వస్తున్న కంటెంట్‌పై స్పందించారు. చదవండి: ఓ ఇంటివాడైన హీరో ఆది, పెళ్లి ఫొటోలు వైరల్ ప్రస్తుతం ఓటీటీ సమస్యగా మారిందని, సెన్సార్ లేకుండా కంటెంట్ వస్తుందన్నారు. అనంతరం ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో నెగిటివ్ న్యూస్ బాగా వేస్తున్నారన్నారు. చివరగా టికెట్ల రెట్స్ పెంచడం మంచిది కాదని నిర్మాత దిల్ రాజు మాట్లాడారని, అలాంటప్పుడు ప్రభుత్వంను పెంచమని అడిగేటప్పుడే ఫ్లెక్సిబుల్ రెట్స్ గురించి తెలుసుకుని అడగాల్సిందన్నారు. అలా చేస్తే సమస్యలు వచ్చేవికావని ఆయన అభిప్రాపడ్డారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4491455922.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
శిల్పా మోహన్‌రెడ్డికి మహేష్ అభిమానుల మద్దతు
నంద్యాల: సూపర్ స్టార్ కృష్ణ, హీరో మహేష్‌బాబు అభిమానులతో సోమవారం వైఎస్ఆర్సీపీ నేత ఆదిశేషగిరిరావు భేటీ అయ్యారు. నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి మద్దతు తెలిపారు. తాము సోమవారం నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారంలో పాల్గొంటారని అభిమాన సంఘం ప్రతినిధులు చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. -
'వేమూరి వంద కోట్ల రూపాయలు వెనకేశాడు'
హైదరాబాద్: చంద్రబాబు నాయుడు మైండ్ గేమ్‌లో లగడపాటి రాజగోపాల్ ఒక పార్టు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు, సినీ నిర్మాత ఆదిశేషగిరిరావు విమర్శించారు. ఇంతకుముందు జరిగిన ఉప ఎన్నికల సమయంలో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తప్పుడు సర్వేలు సృష్టించి బెట్టింగ్‌లను ప్రోత్సహించాడని తద్వారా దాదాపు రూ.100 కోట్లు సంపాదించాడు ఆయన ఆరోపించారు. తొమ్మిదిన్నరేళ్లు సీఎంగా చేసి రాష్ట్రాన్ని యాభై ఏళ్లు వెనక్కి నెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు అధికారం కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతున్నాడని అంతుకుముందు విమర్శించారు. ఒకప్పుడు తిట్టిన నోటితోనే ఇప్పుడు మోడీని కీర్తిస్తున్నాడని దుయ్యబట్టారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే సీమాంధ్ర ప్రజలు ఉన్నారని ఆదిశేషగిరిరావు అన్నారు. -
చిరంజీవి పార్టీ పెట్టి ఏడాదికి అమ్మేస్తే...పవన్
విశాఖ : ఆల్ ఇండియా కృష్ణా-మహేష్ బాబు అభిమానుల సంఘం గౌరవ అధ్యక్షుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆయన శనివారం విశాఖలో విలేకర్లతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమన్నారు. ఎన్నికల్లో ఓటమి భయం చంద్రబాబు నాయుడు కళ్లలోనే కనిపిస్తోందన్నారు. సీమాంధ్రకు అన్యాయం చేసింది చంద్రబాబేనని ఆదిశేషగిరిరావు మండిపడ్డారు. పవన్ కల్యాణ్ ఏం చూసి బీజేపీకి మద్దతు ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మతతత్వాన్నా లేక ఊచకోతల్ని చూసి పవన్ మద్దతు ఇచ్చారో చెప్పాలని ఆదిశేషగిరిరావు ప్రశ్నించారు. చిరంజీవి పార్టీ పెట్టి ఏడాదికి అమ్మేస్తే... పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి రోజులు గడవక ముందే అమ్మేశారని ఆయన విమర్శించారు. -
వైఎస్ఆర్ సీపీలో చేరిన మహేష్ బాబు బాబాయి
బాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు చిన్నాన్న ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆదిశేషగిరిరావు పార్టీలో చేరారు. సూపర్ స్టార్ కృష్ణకు స్వయాన సోదరుడైన ఆదిశేషగిరిరావు పలు చిత్రాలను నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.