సూపర్‌స్టార్ మహేశ్ బాబు దూకుడు మీదున్నాడు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తున్న అతడు నెక్స్ట్ రాజమౌళితో ఓ మూవీ చేయనున్నాడు. ఈ గ్యాప్‌లో ఇటీవలే స్పెయిన్‌కు వెకేషన్‌కు వెళ్లొచ్చాడు. ఇదిలా ఉంటే మహేశ్ తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు మే 31న రీరిలీజ్ కాబోతోంది. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆది శేషగిరి రావు ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.
తాజాగా ఓ ఇంటర్యూలో ఆయన మహేశ్‌బాబు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'మహేశ్‌బాబు నమ్రతను ప్రేమిస్తున్న విషయాన్ని ముందుగా తన తల్లి ఇందిరతో చెప్పాడు. ఆమె వెళ్లి కృష్ణకు చెప్పింది. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు కాబట్టి పెళ్లి చేద్దాం అని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో నా పాత్ర ఏమీ లేదు. కాకపోతే నేను మహేశ్‌బాబుతో వంశీ అని ఒకే ఒక్క సినిమా తీశాను. అందులో నమ్రతను హీరోయిన్‌గా పెట్టి చేశానంతే!
మహేశ్‌బాబు చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. అతడు మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. ఎవరినైనా ఇమిటేట్ చేస్తాడు. అతడు పెద్ద స్టార్ అవుతాడని నేను ముందే ఊహించాను. మహేశ్‌కు అమితాబ్ బచ్చన్‌కు ఉన్నంత టాలెంట్ ఉంది. 14 ఏళ్ల వయసులో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే కారు నడిపాడు. మద్రాస్‌లో పోలీసులు చూసి వెంటపడితే నేరుగా ఆఫీస్‌లోకి ఎంటరై ఏమీ తెలియనట్లు వచ్చి కూర్చున్నాడు. నేనే పోలీసులతో మాట్లాడి పంపించేశాను' అని ఆదిశేషగిరి రావు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment