
ఈ ఇయర్ ఎండింగ్ ఎంతో దూరంలో లేదు. 2017కి గుడ్ బై చెప్పి న్యూ ఇయర్‌కి వెల్కమ్ చెప్పడానికి ఎవరి ప్లానులు వాళ్లు వేసుకుంటున్నారు. మహేశ్‌బాబు మాత్రం ఇంకా ప్లాన్ చేసుకోలేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ 13 నుంచి 26 వరకూ మహేశ్ బిజీ. కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న (‘భరత్ అనే నేను’ టైటిల్ పరిశీలనలో ఉంది) చిత్రం షూటింగ్ షెడ్యూల్ ఇది. త్వరలో మహేశ్ లుక్‌ని విడుదల చేయాలనుకుంటున్నారు. బహుశా న్యూ ఇయర్ కానుకగా నయా లుక్‌ని రిలీజ్ చేస్తారనే ఊహాగానాలు ఉన్నాయి.
ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించడం, అదే తేదీని ముందుగానే ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ బృందం ప్రకటించడంతో డేట్ క్లాష్ ఇష్యూ సీన్లోకొచ్చిన విషయం తెలిసిందే. ‘బన్నీ’ వాసు, దానయ్య ఈ విషయంలో ఓ అండర్‌స్టాండింగ్‌కి రావాలనుకుంటుండగా ఏప్రిల్ 27న ‘2.0’ని రిలీజ్ చేస్తామనే ప్రకటన వచ్చింది. దాంతో మరో ఇష్యూ మొదలైంది. ఈ నేపథ్యంలో మహేశ్ సినిమాని ఏప్రిల్ 13న విడుదల చేస్తారని రెండు మూడు రోజులుగా ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.
‘‘ఇంకా ఏమీ అనుకోలేదు. ‘బన్నీ’ వాసు గోవాలో ఉన్నారు. ఆయన హైదరాబాద్ రాగానే మాట్లాడుకుని ఓ నిర్ణయానికి వస్తాం’’ అని ‘సాక్షి’తో దానయ్య అన్నారు. సో.. ప్రస్తుతానికి ముందు ప్రకటించిన రిలీజ్ డేట్ ఏప్రిల్ 27 అలానే ఉంది. ఏది ఏమైనా ఇటు ‘భరత్ అనే నేను’ అటు ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ నిర్మాతలిద్దరూ విడుదల తేదీ విషయంలో వివాదం చేయకుండా సామరస్యంగానే పరిష్కరించుకోవాలనుకుంటున్నారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment