సినీనటుడు మహేష్‌బాబు జన్మదిన వేడుకలు
Published Tue, Aug 9 2016 10:53 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM
షాద్‌నగర్‌రూరల్ : సినీనటుడు ప్రిన్స్ మహేష్‌బాబు జన్మదినం సందర్భంగా ఆల్‌ఇండియా కష్ణమహేష్ ప్రజాసేన రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్‌ఘోరీ ఆధ్వర్యంలో మంగళవారం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో కేక్ కట్ చేశారు. అనంతరం రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం ఖాదర్‌ఘోరీ మాట్లాడుతూ తెలుగు అభిమానుల గుండెల్లో మహేష్ బాబు చెరగని ముద్ర వేసుకున్నారని భవిష్యత్‌లో మరిన్ని విజయాలను అందుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జాహంగీర్, కిరణ్, మల్లికార్జున్, ప్రవీన్, హర్షద్, తయ్యబ్ తదితరులు పాల్గొన్నారు.
పరమేశ్వర థియేటర్‌లో..
మహేష్‌బాబు జన్మదినం సందర్భంగా పట్టణంలోని పరమేశ్వరి థియేటర్‌లో అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పి.కష్ణారెడ్డి హాజరై కేక్ కట్‌చేసి అభిమానులకు పంచిపెట్టారు. కార్యక్రమంలో అభిమానులు ప్రవీణ్, అంజి, అక్బర్, నాగేష్, చిన్న తదితరులు పాల్గొన్నారు.
సిద్ధాపూర్(కొత్తూరు): మండలంలోని సిద్ధాపూర్‌లో మంగళవారం శివాజీయూత్ ఆధ్వర్యంలో మహేష్‌బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్స్ దత్తత గ్రామంలో అభిమానులు, యువజన సంఘం సభ్యులు కేక్‌కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. త్వరలో రక్తదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం మణివర్ధన్‌రెడ్డి, నర్సింహ, నరేందర్‌రెడ్డి, మహేందర్, గోపాల్, ప్రశాంత్, కిరన్, ప్రభాకర్‌రెడ్డి, అయోధ్యరెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement