
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ముగిసిన అనతంరం టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఆగస్టు 18న హారారే వేదికగా జరనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఆగస్ట్ 27 నుంచి శ్రీలంక వేదికగా ఆసియా కప్ ప్రారంభం కానుండడంతో జింబాబ్వే పర్యటనకు భారత ద్వితీయ శ్రేణి జట్టు వెళ్లనుంది. ఈ పర్యటనకు కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా దూరం కానున్నారు.
ఈ క్రమంలో జింబాబ్వే టూర్‌కు వెళ్లే భారత జట్టుకు కెప్టెన్‌గా శిఖర్ ధావన్, హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే విండీస్ టూర్‌కు టీమిండియా కెప్టెన్‌గా దావన్ ఎంపికైన సంగతి తెలిసిందే. "టీ20 ప్రపంచకప్‌కు సమయం దగ్గర పడుతుండడంతో మా దృష్టి టీ20లపైనే ఉంది. యువ క్రికెటర్‌లు, సీనియర్ ఆటగాళ్ల కలయికతో మా జట్టును తాయారు చేస్తాం.
జింబాబ్వేతో సిరీస్‌కు టీ20 రెగ్యులర్ ఆటగాళ్లందరికీ విశ్రాంతి ఇవ్వాలని అనుకుంటున్నాము. ఈ సిరీస్‌లో భారత సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ నాయకత్వం వహించనున్నాడు. అదేవిదంగా జింబాబ్వే పర్యటనకు భారత జట్టుతో పాటు లక్ష్మణ్ కూడా వెళ్లనున్నాడు. ద్రవిడ్‌కు కూడా గత కొన్నాళ్లుగా విశ్రాంతి లేదు. కాబట్టి ఆసియా కప్‌కు ముందు ఆటగాళ్లతో పాటు ద్రవిడ్‌కు కూడా విశ్రాంతి ఇస్తున్నాం" అని బీసీసీఐ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌కు స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
చదవండి: ENG Vs IND 2nd T20I: 'ఇంగ్లండ్‌తో రెండో టీ20.. దీపక్ హుడా స్థానంలో కోహ్లి రానున్నాడు'