ఉత్కంఠ పోరులో టీమిండియా ఘనవిజయం
చివరి ఓవర్ వరకు నువ్వా-నేనా అన్నట్లుగా సాగిన మొదటి వన్డేలో వెస్టిండీస్‌పై భారత జట్టు మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 97 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. శుబ్‌మన్ గిల్ 64, శ్రేయాస్ అయ్యర్ 54 పరుగులు చేశారు. ఇక ఛేజింగ్‌లో విండీస్ బ్యాట్స్‌మన్ కైలే మేయర్స్ 75 పరుగులు, బ్రాండన్ కింగ్ 54 పరుగులు చేశారు. మ్యాచ్ చివర్లో అకేల్ హోసేన్ 33, రొమారియో షెపర్డ్ 39 నాటౌట్ పోరాడిన జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. విండీస్ జట్టు 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది.
వెస్టిండీస్ టార్గెట్ 309
►వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 97 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. శుబ్‌మన్ గిల్ 64, శ్రేయాస్ అయ్యర్ 54 పరుగులు చేశారు. ఒక దశలో 30 ఓవర్లలో వికెట్ నష్టానికి 200 పరుగులతో పటిష్టంగా కనిపించిన టీమిండియా ఆ తర్వాత 20 ఓవర్లలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి 108 పరుగులు మాత్రమే చేసింది. వెస్టిండీస్ బౌలర్లలో మోతీ, అల్జారీ జోసెఫ్ చెరో రెండు వికెట్లు తీయగా.. షెపర్డ్, హొసెన్ తలా ఒక వికెట్ తీశారు.
45 ఓవర్లలోటీమిండియా 264/5
►టీమిండియా 45 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. దీపక్ హుడా 12, అక్షర్ పటేల్ 4 పరుగులతో ఆడుతున్నారు.
శ్రేయాస్ అయ్యర్(54) ఔట్.. మూడో వికెట్ డౌన్
►శ్రేయాస్ అయ్యర్(54) రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. మోతీ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన అయ్యర్ పూరన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. సంజూ శాంసన్ 2, సూర్యకుమార్ యాదవ్ 9 పరుగులతో ఆడుతున్నారు.
ధావన్ సెంచరీ మిస్.. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
►విండీస్‌తో తొలి వన్డేలో శిఖర్ ధావన్ తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. 97 పరుగుల వద్ద మోతీ బౌలింగ్‌లో షమ్రా బ్రూక్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 34 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. అయ్యర్ 45, సూర్యకుమార్ ఒక పరుగుతో ఆడుతున్నారు.
సెంచరీ దిశగా ధావన్.. టీమిండియా 193/1
►వెస్టిండీస్‌తో తొలి వన్డేలో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి 200 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 87 పరుగులు.. సెంచరీ వైపు పరుగులు తీస్తుండగా.. శ్రేయాస్ అయ్యర్ 42 పరుగులతో ఆడుతున్నాడు.
గిల్ రనౌట్.. టీమిండియా 20 ఓవర్లలో 127/1
►టీమిండియా 20 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 127 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 57, శ్రేయాస్ అయ్యర్ 2 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు శుబ్‌మన్ గిల్(64) రనౌట్‌గా వెనుదిరిగాడు.
10 ఓవర్లలో టీమిండియా స్కోరెంతంటే?
►10 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 73 పరుగులు చేసింది. గిల్ 41, ధావన్ 28 పరుగులతో ఆడుతున్నారు.
దాటిగా ఆడుతున్న ఓపెనర్లు.. టీమిండియా 50/0
►వెస్టిండీస్‌తో తొలి వన్డేలో టీమిండియా ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. ఏడు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 24, శుబ్‌మన్ గిల్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
►ఇంగ్లండ్‌తో సిరీస్‌ను విజయవంతంగా ముగించుకున్న టీమిండియా తాజాగా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు సన్నద్దమైంది. ట్రినిడాడ్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రోహిత్ సహా సీనియర్ల గైర్హాజరీలో శిఖర్ ధావన్ కెప్టెన్సీలో యువ భారత్ జట్టు విండీస్‌తో తలపడుతుండడంతో ఆసక్తిగా మారింది. ముందుగా అనుకున్నట్లే జడేజా గాయంతో ఈ వన్డేకు దూరం కాగా.. జాసన్ హోల్డర్ కరోనా కారణంగా తొలి వన్డేకు దూరంగా ఉన్నాడు.
A look at our Playing XI for the 1st ODI.
Live - https://t.co/tE4PtTfY9d #WIvIND pic.twitter.com/WuwCljou75
— BCCI (@BCCI) July 22, 2022
భారత్: ధావన్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ ,దీపక్ హుడా, సంజూ సామ్సన్, సూర్యకుమార్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్, చహల్, సిరాజ్.
వెస్టిండీస్: పూరన్ (కెప్టెన్), షయ్ హోప్(వికెట్ కీపర్), బ్రాండన్ కింగ్, షమర్ బ్రూక్స్, కైల్ మేయర్స్, రోవ్‌మన్ పావెల్, అకేల్ హోసేన్, రొమారియో షెపర్డ్, అల్జారీ జోసెఫ్, గుడాకేష్ మోటీ, జేడెన్ సీల్స్
పిచ్, వాతావరణం
వన్డేలకు తగిన వేదిక. బ్యాటింగ్, బౌలింగ్‌కు సమంగా అనుకూలిస్తుంది. గురువారం కొంత వర్షం కురిసి భారత జట్టు ప్రాక్టీస్ ఇండోర్‌కే పరిమితమైనా...మ్యాచ్ రోజు మాత్రం వర్ష సూచన లేదు.
Comments
Please login to add a commentAdd a comment