వెస్టిండీస్‌తో తొలి వన్డేలో స్టాండింగ్ కెప్టెన్ శిఖర్ ధావన్ మూడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. వెస్టిండీస్ గడ్డపై శతకం అందుకోవాలన్న ధావన్ ఈ మ్యాచ్‌లో తీరకుండానే ఔటయ్యాడు. 97 పరుగుల వద్ద మోతీ బౌలింగ్‌లో షమ్రా బ్రూక్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే సెంచరీ మిస్ అయినప్పటికి ధావన్ తొలి వన్డేలో మాత్రం రికార్డుల మోత మోగించాడు. అవేంటనేవి ఒకసారి పరిశీలిద్దాం.
►అతి పెద్ద వయసులో వన్డేల్లో హాఫ్ సెంచరీ చేసిన భారత కెప్టెన్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు శిఖర్ ధావన్. ఇంతకుముందు 1999లో కెప్టెన్‌గా చివరి హాఫ్ సెంచరీ చేసినప్పుడు మహ్మద్ అజారుద్దీన్ వయసు 36 ఏళ్ల 120 రోజులు. ప్రస్తుతం ధావన్ వయసు 36 ఏళ్ల 229 రోజులు.
►వెస్టిండీస్ గడ్డపై అత్యధిక వన్డేలు ఆడిన టీమిండియా ఆటగాడిగా కోహ్లితో కలిసి ధావన్ సంయుక్తంగా ఉన్నాడు. ఇప్పటివరకు కోహ్లి, ధావన్‌లు విండీస్ గడ్డపై 15 మ్యాచ్‌లు ఆడారు.
►విండీస్ గడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా టాప్-5 బ్యాట్స్‌మెన్లలో శిఖర్ ధావన్ యువరాజ్, రోహిత్ శర్మలను అధిగమించి మూడో స్థానానికి చేరుకున్నాడు. ధావన్ 15 మ్యాచ్‌ల్లో 445 పరుగులు చేశాడు. ధావన్ కంటే ముందు ఎంఎస్ ధోని(15 మ్యాచ్‌ల్లో 458 పరుగులు), కోహ్లి (15 మ్యాచ్‌ల్లో 790 పరుగులు), ఉన్నారు.
►శిఖర్ ధావన్‌కి ఇది 150వ వన్డే. తొలి 150 వన్డేల్లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు శిఖర్ ధావన్. హషీమ్ ఆమ్లా 57, విరాట్ కోహ్లీ, వీవిన్ రిచర్డ్స్ 55 సార్లు 50+ స్కోర్లు చేయగా శిఖర్ ధావన్‌కి ఇది 53వ 50+ స్కోరు.
►వెస్టిండీస్‌లో శిఖర్ ధావన్‌కి ఇది ఐదో 50+ స్కోరు. విరాట్ కోహ్లీ 7 సార్లు 50+ స్కోరు చేసి టాప్‌లో ఉంటే, రోహిత్ శర్మ ఐదు సార్లు ఈ ఫీట్ సాధించి ధావన్‌తో సమానంగా ఉన్నాడు.
►వెస్టిండీస్‌లో వన్డేల్లో అతి పిన్న వయసులో 50+ స్కోరు చేసిన భారత బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో నిలిచాడు శుబ్‌మన్ గిల్. 22 ఏళ్ల 215 రోజుల వయసులో విరాట్ కోహ్లీ, వెస్టిండీస్‌లో వన్డేల్లో 50+ స్కోరు నమోదు చేయగా, శుబ్‌మన్ గిల్ వయసు ప్రస్తుతం 22 ఏళ్ల 317 రోజులు.
చదవండి: హాట్ టాపిక్‌గా భారత్- విండీస్ వన్డే ట్రోపీ.. ఎక్తాకపూర్ తయారు చేసిందా?
Comments
Please login to add a commentAdd a comment