తొలి వన్డేలో పోరాడి ఓడిన భారత్!
సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఓటమి పాలైంది. చివరి వరకు పోరాడినా నాలుగు ఓవర్లలో పరుగులు రాబట్టకపోవడంతో పాటు వికెట్లను కోల్పోయింది భారత్. దీంతో తొలి మ్యాచ్ సౌతాఫ్రికా విజయం సాధించింది. సంజు శాంసన్(86) నాటౌట్ వీరోచిత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.
35 ఓవర్లకు భారత్ స్కోర్: 177/5
35 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోరు 177/5. క్రీజులో శార్ధూల్(19), సంజు శాంసన్(48) ఉన్నారు.
30 ఓవర్లకు భారత్ స్కోర్: 145/5
30 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోరు 145/5. క్రీజులో శార్ధూల్(12), సంజు శాంసన్(25) ఉన్నారు. భారత్ విజయం కోసం చివరి 10 ఓవర్లో 105 పరుగులు అవసరం.
ఐదో వికెట్ కోల్పోయిన భారత్.. గెలుపు కష్టమే!
అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయస్ అయ్యర్(50), ఎంగిడి ఓవర్లో భారీ షాట్ ఆడబోయి వికెట్ సమర్పించుకున్నాడు. ఈ వికెట్‌తో భారత్ గెలుపు కష్టంగా మరిందనే చెప్పాలి. క్రీజులో సంజు శాంసన్(15), శార్ధూల్ ఠాకూర్ (0) ఉన్నారు.
25 ఓవర్లకు భారత్ స్కోర్:112/4
25 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోరు 112/4. క్రీజులో శ్రేయస్ అయ్యర్(45), సంజు శాంసన్(14) ఉన్నారు.
పీకల్లోతు కష్టాల్లో భారత్.. నాలుగో వికెట్ డౌన్
51 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన ఇషాన్ కిషాన్.. మహరాజ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరుకున్నాడు. క్రీజులో శ్రేయస్ అయ్యర్(1), సంజు శాంసన్(0) ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన భారత్
48 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన గైక్వాడ్.. షమ్సీ బౌలింగ్‌లో స్టంప్ ఔటయ్యి వెనుదిరిగాడు. క్రీజులో ఇషాన్ కిషన్(19), శ్రేయస్ అయ్యర్(0) ఉన్నారు.
15 ఓవర్లకు భారత్ స్కోర్:45/2
15 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ స్కోరు 45/2. క్రీజులో ఇషాన్ కిషన్(18), గైక్వాడ్(17) ఉన్నారు.
10 ఓవర్లకు భారత్ స్కోర్:24/2
ఆరంభంలోనే భారత్ శిఖర్, గిల్ రూపంలో ఓపనర్లను కోల్పోయింది. 10 ఓవర్లు ముగిసేసమయానికి భారత్ స్కోరు 24/2. క్రీజులో క్రీజులో ఇషాన్ కిషన్(10), గైక్వాడ్(6) ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన భారత్
8 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన ధావన్.. పార్నెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో ఇషాన్ కిషన్(0), గైక్వాడ్(1) ఉన్నారు
తొలి వికెట్ కోల్పోయిన భారత్: 8/1
3 ఓవర్లు ముగిసే సరికి భారత్ తొలి వికెట్‌ను కోల్పోయింది. రబాడా బౌలింగ్‌లో గిల్ పెవిలియన్‌కు చేరుకున్నాడు. క్రీజులో శిఖర్ ధావన్(4), గైక్వాడ్(0) ఉన్నారు
భారత్ టార్గెట్- 250
మొదట్లో తడబడ్డ దక్షిణాఫ్రికా బ్యాటర్లు, చివరికి భారత్ ముందు గౌరవప్రదమైన స్కోరునే ఉంచారు. వర్షం కారణంగా మ్యాచ్‌ని 40 ఓవర్లకు కుదించగా.. మ్యాచ్ ముగిసే సమయానికి సౌతాఫ్రికా 249 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది.(40 ఓవర్లు- 249/4) ..క్లాసెన్(74), మిల్లర్(75 )పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
35 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 195/4
35 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. క్రీజులో క్లాసెన్(48), మిల్లర్(49 )పరుగులతో ఉన్నారు.
30 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 164/4
30 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. క్రీజులో క్లాసెన్(39), మిల్లర్(28 )పరుగులతో ఉన్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
108 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా డికాక్ రూపంలో నాలుగో వికెట్ కోల్పోయింది. క్రీజులో నిలదొక్కుకున్న డికాక్ అర్థసెంచరీ దగ్గర్లో తన వికెట్‌ని రవి బిష్ణోయ్‌కు సమర్పించుకున్నాడు. క్రీజులో క్లాసెన్(19), డేవిడ్ మిల్లర్(0) ఉన్నారు
21 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 105/3
21 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 3 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. క్రీజులో డికాక్(46), క్లాసెన్(18) పరుగులతో ఉన్నారు.
కష్టాల్లో దక్షిణాఫ్రికా.. మూడో వికెట్ డౌన్
71 పరుగుల వద్ద దక్షిణిఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. బావుమా అవుట్ కావడంతో క్రీజులోకి వచ్చిన మార్క్రామ్(0) కుల్‌దీప్ బౌలింగ్‌లో డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. 16 ఓవర్లకు స్కోరు: 71/3
రెండో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
70 పరుగుల వద్ద దక్షిణిఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన బావుమా.. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి మార్క్రామ్ వచ్చాడు.
తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 49 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన మలాన్.. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.
8 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 28/0
8 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. క్రీజులో డికాక్(10), మలాన్(17) పరుగులతో ఉన్నారు.
2 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 8/0
2 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసింది. క్రీజులో డికాక్(6),మలాన్(2) పరుగులతో ఉన్నారు.
ఎట్టకేలకు భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. మరోవైపు రుత్‌రాజ్ గైక్వాడ్ టీమిండియా తరపున వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు.
తుది జట్లు
దక్షిణాఫ్రికా: జన్నెమన్ మలన్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి, తబ్రైజ్ షమ్సీ
టీమిండియా: శిఖర్ ధావన్(కెప్టెన్), శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్(వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, అవేష్ ఖాన్
లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా తలపడేందుకు సిద్దమైంది. అయితే మ్యాచ్ ఆరంభానికి వరుణుడు అంతరాయం కలిగించాడు. వర్షం కారణంగా మ్యాచ్ అరగంట ఆలస్యంగా ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు టాస్ వేయాల్సి ఉండగా.. వర్షంతో ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో అంతరాయం కలిగింది.
టాస్ 1: 30కు పడుతుంది అని బీసీసీఐ ట్విట్ చేసింది. అయితే టాస్ పడే సమయానికి మళ్లీ వర్షం రావడంతో మ్యాచ్ మరింత అలస్యంగా ప్రారంభం కానుంది. కాగా రోహిత్ సారథ్యంలోని సీనియర్ భారత జట్టు టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాకు పయనం కాగా.. ధావన్ నేతృత్వంలో భారత ద్వితీయ శ్రేణి జట్టు దక్షిణాఫ్రికాతో తలపడుతోంది. ఈ సిరీస్‌కు దేశీవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణిస్తున్న ముఖేష్ కుమార్, పటిదార్‌కు భారత జట్టు తరపున చోటు దక్కింది.
చదవండి: Womens Asia Cup 2022: పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన థాయ్‌లాండ్.. క్రికెట్ చరిత్రలో తొలి విజయం
Comments
Please login to add a commentAdd a comment