IND Vs SA 3rd ODI: Shikhar Dhawan Takes Shreyas Iyer, Kuldeep Yadav And Others Out For Dinner - Sakshi
Sakshi News home page

IND vs SA: దక్షిణాఫ్రికాతో మూడో వన్డే.. డిన్నర్‌కు వెళ్లిన భారత ఆటగాళ్లు

Published Tue, Oct 11 2022 10:16 AM | Last Updated on Tue, Oct 11 2022 11:02 AM

Shikhar Dhawan takes Shreyas Iyer, Kuldeep Yadav and others out for Dinner - Sakshi

సిరీస్‌ ఫలితాన్ని నిర్ణయించే మూడో వన్డేలో దక్షిణాప్రికాతో తాడో పేడో తేల్చుకోవడానికి టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌ మంగళవారం (ఆక్టోబర్‌11) ఢిల్లీ వేదికగా జరగనుంది. అయితే మ్యాచ్‌కు ముందు రోజు(సోమవారం) టీమిండియా కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌తో పాటు శ్రేయస్‌ అయ్యర్‌, అవేశ్‌ ఖాన్‌, కుల్దీప్‌ యాదవ్‌, శార్ధూల్‌ ఠాకూర్‌ డిన్నర్‌ వెళ్లారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలను ధావన్‌ తన సోషల్‌ మీడియా ఖతాలో షేర్‌ చేశాడు. ఇక రాంఛీ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఘన విజయం సాధించిన భారత్‌.. మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ ఆజేయ సెంచరీతో చెలరేగాడు. ఇక మూడో వన్డేలో జట్టులో ఎటువంటి మార్పులు లేకుండా భారత్‌ బరిలోకి దిగే అవకాశం ఉంది.
తుది జట్లు(అంచనా):
భారత్‌: శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్, మహ్మద్ సిరాజ్

దక్షిణాఫ్రికా: జన్నెమన్ మలన్, క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, జోర్న్ ఫోర్టుయిన్, కగిసో రబాడ, అన్రిచ్ నోర్ట్జే


చదవండిShahbaz Ahmed: 'ఏదైనా సాధిస్తేనే ఇంటికి రా..'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement