
Shreyas Iyer Registers Impressive Record On Kanpur Test: టీమిండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ తన ఆరంగేట్ర టెస్ట్ మ్యాచ్‌లో మరో రికార్డు సాధించాడు. భారత తరుపున ఆరంగేట్ర మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నిగ్స్‌లు కలిపి అయ్యర్ 170 పరుగులు సాధించాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 105, రెండో ఇన్నిగ్స్‌లో 65 పరుగులు చేశాడు. కాగా అంతకుముందు డెబ్యూ టెస్ట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ధావన్(187) ఉండగా, తరువాతి స్ధానంలో 177 పరుగులతో రోహిత్ శర్మ ఉన్నాడు. కాగా ఆరంగేట్ర మ్యాచ్‌లో సెంచరీ సాధించిన 16వ భారత ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment