
PC: BCCI Twitter
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఇప్పడు వన్డే సిరీస్‌పై కన్నేసింది. లక్నో వేదికగా ఆక్టోబర్6న తొలి వన్డేలో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. కాగా రోహిత్ శర్మ సారథ్యంలో భారత సీనియర్ జట్టు టీ20 ప్రపంచకప్-2022 కోసం ఆస్ట్రేలియాకు వెళ్లనుండడంతో.. భారత ద్వితీయ శ్రేణి జట్టు ఈ సిరీస్‌లో తలపడనుంది.
ఈ జట్టుకు భారత వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారధ్యం వహించనున్నాడు. అదే విధంగా రజిత్ పాటిదార్, ముఖేష్ కుమార్‌కు తొలి సారిగా టీమిండియాలో చోటు దక్కింది.
ఓపెనర్లగా ధావన్, శుబ్‌మన్ గిల్
తొలి వన్డేలో ఓపెనర్లగా ధావన్, శుబ్‌మాన్ గిల్ రానున్నారు. గిల్ ఇటీవల కాలంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. విండీస్, జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో అదరగొట్టాడు. ఇప్పటి వరకు తన అంతర్జాతీయ కెరీర్‌లో 9 వన్డేలు ఆడిన గిల్.. 499 పరుగులు సాధించాడు.
ఇక ధావన్ కూడా పర్వాలేదనిపిస్తున్నాడు. ధావన్ ఆడిన అఖరి ఆరు వన్డేల్లో 322 పరుగులు సాధించాడు. ఇక మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠికి చోటు దక్కే అవకాశం కన్పిస్తుంది. మరోవైపు రజిత్ పాటిదార్ భారత్ తరపున అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
అదే విధంగా ఆల్ రౌండర్ల కోటాలో షబాజ్ ఆహ్మద్, శార్థూల్ ఠాకూర్‌కు చోటు దక్కే ఛాన్స్ ఉంది. ఇక చివరగా మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, రవి బిష్ణోయ్‌కు బౌలర్ల కోటాలో ఎంపికయ్యే అవకాశం కన్పిస్తోంది.
తొలి వన్డేకు భారత జట్టు (అంచనా): శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, రజిత్ పటిదార్, రాహుల్ త్రిపాఠి, సంజు శాంసన్ (వికెట్), షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్
చదవండి: T20 World Cup 2022: 'టీ20 ప్రపంచకప్ టైటిల్ రేసులో ఆ మూడు జట్లే నిలుస్తాయి'
Comments
Please login to add a commentAdd a comment