శివాలెత్తిన శ్రేయస్, ఇషాన్.. సౌతాఫ్రికాపై టీమిండియా ఘన విజయం
దక్షిణాఫ్రికా నిర్ధేశించిన 279 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. శ్రేయస్ అయ్యర్ (113 నాటౌట్) శతకంలో, ఇషాన్ కిషన్ (93) భారీ అర్ధశతకంతో చెలరేగడంతో 45.5 ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
శతక్కొట్టిన అయ్యర్
279 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రేయస్ అయ్యర్ శతకం బాదాడు. సహచరుడు ఇషాన్ కిషన్ 7 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ శ్రేయస్ మాత్రం ఆ తప్పు చేయకుండా నిలకడగా ఆడి కెరీర్‌లో రెండో శతకాన్ని నమోదు చేశాడు. అయ్యర్ 103 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. 43 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 263/3. అయ్యర్‌కు జతగా శాంసన్ (21) క్రీజ్‌లో ఉన్నాడు.
సెంచరీ చేజార్చుకున్న ఇషాన్
వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఇషాన్ కిషన్ 7 పరుగుల తేడాతో సెంచరీ చేసే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నారు. హాఫ్ సెంచరీ చేశాక ఆకాశమే హద్దుగా చెలరేగిన ఇషాన్.. ఫోర్టున్ బౌలింగ్‌లో హెండ్రిక్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇషాన్ తన ఇన్నింగ్స్‌లో 84 బంతులను ఎదుర్కొని 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేశాడు. 35 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 210/3. క్రీజ్‌లో శ్రేయస్ (71)కు జతగా సంజూ శాంసన్ వచ్చాడు.
హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న ఇషాన్, శ్రేయస్
48 పరుగులకే 2 వికెట్లు కోల్పోయాక టీమిండియా ఆచితూచి ఆడుతుంది. ఇషాన్ కిషన్ (60 బంతుల్లో 50; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (50 బంతుల్లో 50; 7 ఫోర్లు) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 26 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 144/2.
100 దాటిన టీమిండియా స్కోర్
48 పరుగులకే ఓపెనర్లిద్దరి వికెట్లు కోల్పోయిన టీమిండియా ఆ తర్వాత మరో వికెట్ కోల్పోకుండా ఆచితూచి ఆడుతూ 100 పరుగుల మార్కును దాటింది. కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో సిక్సర్ బాది ఇషాన్ కిషన్ 100 పరుగుల స్కోర్‌ను దాటించాడు. అదే ఓవర్‌లో ఇషాన్ మరో సిక్సర్ కూడా బాది గేర్ మార్చాడు. 21 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 111/2. క్రీజ్‌లో ఇషాన్ (42), శ్రేయస్ అయ్యర్ (26) ఉన్నారు.
48 పరుగులకే ఓపెనర్లిద్దరూ ఔట్
భారీ లక్ష్యఛేదనలో టీమిండియా ఆరంభంలోనే తడబడుతుంది. 48 పరుగులకే ఓపెనర్లిద్దరూ ఔటయ్యారు. ధవన్ 13 పరుగులు చేసి ఔట్ కాగా.. 9వ ఓవర్‌లో రబాడ బౌలింగ్‌లో గిల్ (28) క్యాచ్ అండ్ బౌల్డ్ అయ్యాడు. 9 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 49/2 కాగా.. క్రీజ్‌లో ఇషాన్ (5), శ్రేయస్ (1) ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
279 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా ఇన్నింగ్స్ 6వ ఓవర్ ఆఖరి బంతికి తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ ధవన్ (13)ను వేన్ పార్నెల్ క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ బాట పట్టించాడు. 6 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 28/1. క్రీజ్‌లో గిల్ (13), ఇషాన్ కిషన్ ఉన్నారు.
రాణించిన మార్క్రమ్, హెండ్రిక్స్.. టీమిండియా టార్గెట్ 279
టీమిండియా బౌలర్లు ఇన్నింగ్స్‌లో మధ్యలో వరుస వికెట్లు తీసి ప్రెషర్ పెట్టడంతో భారీ స్కోర్ దిశగా సాగిన దక్షిణాఫ్రికా 278 పరుగులకే (7 వికెట్ల నష్టానికి) పరిమతమైంది. రీజా హెండ్రిక్స్ (74), ఎయిడెన్ మార్క్రమ్ (79) అర్ధసెంచరీలతో రాణించగా.. క్లాసెన్ (30), డేవిడ్ మిల్లర్ (35 నాటౌట్) పర్వాలేదనిపించారు.
ఆఖర్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో దక్షిణాఫ్రికా 300 స్కోర్ చేరుకోలేకపోయింది. టీమిండియా బౌలర్లలో సిరాజ్ (3/38) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. సుందర్, షాబాజ్ అహ్మద్, శార్ధూల్ ఠాకూర్ తలో వికెట్ దక్కించుకున్నారు.
ఆరో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
256 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన పార్నెల్.. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.
ఐదో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
వరుస క్రమంలో దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయింది. 79 పరుగులు చేసిన మార్‌క్రమ్.. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 40 ఓవర్లకు దక్షిణాప్రికా స్కోర్: 221/5
నాలుగో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
215 పరుగుల వద్ద ప్రోటీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన క్లాసన్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.
36 ఓవర్లకు దక్షిణాప్రికా స్కోర్: 197/3
36 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. క్రీజులో మార్‌క్రమ్(76), క్లాసన్(15) పరుగులతో ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన దక్షిణాప్రికా
169 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. 74 పరుగులు చేసిన హెండ్రిక్స్.. సిరాజ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.
25 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్ 122/2
25 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 2 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. ప్రోటీస్ బ్యాటర్లు హెండ్రిక్స్(49), మార్‌క్రమ్(41) పరుగులతో ఉన్నారు.
18 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 77/2
18 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. క్రీజులో మార్క్రమ్(18), హెండ్రిక్స్(29) పరుగులతో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
40 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన మలాన్.. షబాజ్ ఆహ్మద్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో షబాజ్‌కు ఇది తొలి వికెట్.
6 ఓవర్లకు దక్షిణాప్రికా స్కోర్: 24/1
6 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది. క్రీజులో మలాన్(13), హెండ్రిక్స్(3) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
7 పరుగుల వద్ద దక్షిణాప్రికా తొలి వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన డికాక్.. సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి హెండ్రిక్స్ వచ్చాడు.
రాంఛీ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. రుత్‌రాజ్ గైక్వాడ్, బిష్ణోయ్ స్థానంలో సుందర్, షాబాజ్ ఆహ్మద్ జట్టులోకి వచ్చారు.
మరో వైపు ఈ మ్యాచ్‌కు ప్రోటీస్ రెగ్యూలర్ కెప్టెన్ టెంబా బావుమా, స్పిన్నర్ షమ్సీ దూరమయ్యారు. వారి స్థానంలో హెండ్రిక్స్, బెజార్న్ ఫోర్టుయిన్ జట్టులోకి వచ్చారు.
తుది జట్లు
దక్షిణాఫ్రికా: జన్నెమన్ మలన్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్(కెప్టెన్), జోర్న్ ఫోర్టుయిన్, కగిసో రబడ, అన్రిచ్ నార్టే
భారత జట్టు: శిఖర్ ధావన్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అవేష్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment