చైనా వేదికగా జరగనున్న ఆసియా క్రీడలు 2023లో భారత క్రికెట్ జట్లు తొలిసారి పాల్గొనబోతున్నాయి. ఈ క్రమంలో ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత మహిళల, పురుషుల జట్లను బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. ఈ ఆసియాగేమ్స్‌లో భారత పురుషల జట్టుకు వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను సారథిగా ఎంపిక చేస్తారని అంతా భావించారు.
కానీ అజిత్ అగర్కార్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మాత్రం అనూహ్యంగా యువ ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. దావన్‌కు కనీసం జట్టులో కూడా చోటు దక్కలేదు. ఐపీఎల్‌లో అదరగొట్టిన యువ ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించారు.
ఆగస్టు 31 నుంచి ఆసియాకప్ జరగనుండడంతో భారత ద్వితీయ శ్రీణి జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ జట్టులో ఐపీఎల్ హీరో రింకూ సింగ్‌తో పాటు తిలక్ వర్మ, యశస్వీ జైశ్వాల్, ప్రభుసిమ్రాన్‌కు చోటు దక్కింది. వీరితోపాటు ఆల్‌రౌండర్ శివమ్ దుబే రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.
ఒకప్పుడు జట్టులో చోటుకే దిక్కులేదు..
ఇక ఆసియాకప్‌లో పాల్గోనే జట్టుకు రుత్‌రాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. ధావన్ వంటి అనుభవం ఉన్న ఆటగాడని కాదని గైక్వాడ్‌ను సారధిగా ఎంపిక చేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. అయితే దేశవాళీ టోర్నీల్లో మాత్రం మహారాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా రుత్‌రాజ్ వ్యవహరిస్తున్నాడు.
దేశవాళీ క్రికెట్‌లో కెప్టెన్‌గా రుత్‌రాజ్ విజయవంతం కావడంతో.. భారత జట్టు పగ్గాలను అప్పగించినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే రుత్‌రాజ్ కెప్టెన్‌గా ఎంపికైనప్పటికి.. భారత్ సీనియర్ జట్టు తరపున ఆడిన అనుభవం మాత్రం పెద్దగా లేదు. అతడు ఇప్పటి వరకు టీమిండియా తరపున 9 టీ20లు, కేవలం ఒక్క వన్డే మాత్రం ఆడాడు.
9 టీ20ల్లో 16.88 సగటుతో 135 పరుగులు చేయగా.. ఏకైక వన్డేలో 19 పరుగులు రుత్‌రాజ్ సాధించాడు. రుత్‌రాజ్ చివరగా టీమిండియా తరపున గతేడాది జూన్‌లో ఆడాడు. అప్పటినుంచి భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. అయితే ఐపీఎల్-2023లో రుత్‌రాజ్ అదరగొట్టడంతో విండీస్ టూర్‌కు సెలక్టర్లు మళ్లీ పిలుపునిచ్చారు.
విండీస్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లకు రుత్‌రాజ్‌కు భారత జట్టులో చోటు దక్కింది. కానీ విండీస్‌తో తొలి టెస్టుకు మాత్రం తుది జట్టులో అతడికి చోటు దక్కలేదు. అయితే ఒకప్పుడు జట్టులొ చోటు కోసం అతృతగా ఎదురుచూసిన రుత్‌రాజ్.. ఇప్పుడు ఏకంగా భారత జట్టును నడిపించే స్థాయికి చేరుకోవడం విశేషం. ఈ ఏడాది ఆసియా గేమ్స్ ఆక్టో 23 నుంచి అక్టోబర్ 8 వరకు జరుగుతాయి.
చదవండి: Rohit Sharma Serious On Ishan Kishan: సింగిల్ తీయడానికి 20 బంతులు.. కిషన్‌పై రోహిత్ సీరియస్! వీడియో వైరల్
టీమిండియా పురుషుల జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్ , ముఖేష్ కుమార్, శివం మావి, శివం దూబే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్
స్టాండ్‌బై ప్లేయర్స్: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్
Comments
Please login to add a commentAdd a comment